రోజూ బాదుడే!

Published: Mon, 28 Mar 2022 03:21:20 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రోజూ బాదుడే!

  • వారంలో ఆరోసారి ఇంధన మంట
  • పెట్రోల్‌ లీటరుకు 34 పైసలు, డీజిల్‌ 38 పైసలు పెంపు
  • విజయవాడలో అత్యధికంగా పెట్రోల్‌ రూ.114.29
  • ఆ తర్వాత ముంబైలో రూ.114.18.. హైదరాబాద్‌లో రూ.112.69
  • ఎనిమిదేళ్లలో రూ.26 లక్షల కోట్ల లూటీ: కాంగ్రెస్‌


న్యూఢిల్లీ, మార్చి 27: పెట్రో ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. వారం రోజుల్లో ఆరోసారి ధరలు పెరిగాయి. ఆదివారం పెట్రోల్‌ లీటరుకు 50 పైసలు, డీజిల్‌ 55 పైసలు ఎగబాకగా.. మరోమారు ధరలను సవరిస్తూ చమురు సంస్థలు ఉత్తర్వులిచ్చాయి. పెట్రోల్‌పై 30పైసలు, డీజిల్‌పై 35పైసల చొప్పున పెంపు ఉంటుందని స్పష్టం చేశాయి. ఈ ఉత్తర్వులు సోమవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నాయి. తాజా పెంపుతో.. న్యూఢిల్లీలో పెట్రోల్‌ లీటరుకు రూ.99.41, డీజిల్‌ లీటరుకు రూ.90.22కు చేరాయి. విజయవాడలో అత్యధికంగా లీటరు పెట్రోల్‌ రూ. 114.29, డీజిల్‌ రూ. 100.32కు చేరుకున్నాయి. గత వారం రోజుల్లో ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.4 నుంచి రూ.4.40కు పెరగడం గమనార్హం. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిరుడు నవంబరు 4 నుంచి మార్చి 21 వరకు చమురు కంపెనీలు ధరలను సవరించలేదు.


ఎన్నికల ఫలితాలు వచ్చిన 11 రోజుల్లోనే మళ్లీ ధరలు పెంచి సామాన్యుడిపై భారం మోపడం ప్రారంభించాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలపై కేంద్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా విమర్శించింది. గత ఎనిమిదేళ్లలో పెట్రో ధరలపై ఎక్సైజ్‌ సుంకం ద్వారా మోదీ సర్కారు దేశ ప్రజల నుంచి రూ.26 లక్షల కోట్లు దండుకుందని, ఆ డబ్బుకు లెక్క చెప్పాలని డిమాండ్‌ చేసింది. ‘‘ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరలు 137 రోజుల పాటు స్థిరంగా ఉన్నాయి. గత ఆరు రోజుల్లోనే ధరలు రూ.3.75 పెరిగాయి’’ అని కాంగ్రెస్‌ ప్రధాన ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా ట్వీట్‌ చేశారు. 

రోజూ బాదుడే!

దేశంలోని వివిధ నగరాల్లో ఆదివారం నాటి పెట్రోల్‌ ధరలు ఈవిధంగా ఉన్నాయి

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.