యూపీలో ఆరో విడత పొలింగ్ ప్రారంభం

ABN , First Publish Date - 2022-03-03T13:06:17+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 10 జిల్లాల్లోని 57 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరో విడత పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది....

యూపీలో ఆరో విడత పొలింగ్ ప్రారంభం

గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 10 జిల్లాల్లోని 57 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరో విడత పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. కుషీనగర్, బస్తీ, సంత్ కబీర్ నగర్, అంబేద్కర్ నగర్, గోరఖ్‌పూర్, డియోరియా, బల్లియా జిల్లాల్లోని 57 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ పర్వంలో 1.5 లక్షల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన సొంత గడ్డ గోరఖ్‌పూర్ నుంచి పోటీ చేస్తున్నారు.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోటీలో ఉన్న గోరఖ్‌పూర్ సిటీ, రాష్ట్రంలోని తొమ్మిది సెన్సిటివ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ ప్రారంభమైంది.పోలింగ్ సందర్భంగా గోరఖ్‌పూర్ పీఠంలో గురువారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రార్థనలు చేశారు.


గోరఖ్‌పూర్ ఆశ్రయం వద్ద ఉన్న ఆవులకు యోగి బెల్లం తినిపించారు. అనంతరం యోగి గోరఖ్‌పూర్ పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు వేశారు. యూపీ ఆరో విడత ఎన్నికల్లో 676 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.గోరఖ్‌పూర్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి యోగి ఆదిత్యనాథ్ తన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు లల్లూ తమ్‌కుహి రాజ్ స్థానం నుంచి బరిలోకి దిగారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన స్వామి ప్రసాద్ మౌర్య ఫాజిల్‌నగర్ అసెంబ్లీనియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.పదవీకాలం ముగిసిన అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రామ్ గోవింద్ చౌదరి బన్స్దీహ్ నుంచి పోటీ చేస్తున్నారు.


Updated Date - 2022-03-03T13:06:17+05:30 IST