
ముజఫర్‌నగర్: ఓ ఇల్లు పాముల గూడుగా మారిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది.ముజఫర్‌నగర్‌లోని ఓ ఇంటి నుంచి 60 పాములు, 75 పాము గుడ్డు పెంకులను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ముజఫర్‌నగర్ ఇంట్లోని బాత్‌రూమ్‌లో 60 పాములు, 75 గుడ్ల పెంకులు కనిపించాయి.ఇంట్లోనే పాముల సంచారం వెలుగుచూడటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురి అయ్యారు. పాములు పట్టే వారిని రంగంలోకి దించి గంటల తరబడి శ్రమించి పాములను పట్టుకుని అడవుల్లోకి వదిలారు. పాములున్న ఈ ఇల్లు ముజఫర్‌నగర్ జిల్లాలోని ఖతౌలీ తహసీల్‌లో ఉంది. ఈ ఇల్లు రంజిత్ సింగ్‌కు చెందినది కానీ, చాలా కాలం క్రితం దీన్ని అద్దెకు ఇచ్చారని దర్యాప్తులో తేలింది.
పాము గూడు ఉన్న ఇంట్లో దుమ్మూ ధూళి ఉందని అక్కడి నివాసితులు తెలిపారు.సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్లనే ఇంత పెద్ద సంఖ్యలో పాములు ఇంట్లోకి వచ్చాయని స్థానికులు చెప్పారు.ఇంట్లో 60 పాములున్న ఘటన ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి