Telugudesam నేత ఆస్తుల ధ్వంసం..

ABN , First Publish Date - 2021-11-09T06:01:09+05:30 IST

బోయకొండ ఆలయ మాజీ ఛైర్మన్‌, టీడీపీ నేత ఎస్‌కే.రమణారెడ్డి ఇంటిస్థలం ప్రహరీ, షెడ్లను గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి ఎక్స్‌కవేటర్‌తో ధ్వంసం చేశారు.

Telugudesam నేత ఆస్తుల ధ్వంసం..

  • బోయకొండ మాజీ ఛైర్మన్‌ ఎస్‌కే ఆస్తుల ధ్వంసం 
  • ఇంటిస్థలం ప్రహారీ, షెడ్డు నేలమట్టం
  • రూ.17 లక్షల నష్టం


పుంగనూరు, నవంబరు 8: బోయకొండ ఆలయ మాజీ ఛైర్మన్‌, టీడీపీ నేత ఎస్‌కే.రమణారెడ్డి ఇంటిస్థలం ప్రహరీ, షెడ్లను గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి ఎక్స్‌కవేటర్‌తో ధ్వంసం చేశారు. ప్రహరీ, అక్కడ ఉన్న వివిధ పనిమట్లు విలువ దాదాపు రూ.17 లక్షలు విలువ ఉంటుందని  ఎస్‌కే వద్ద పనిచేసే జెల్లి మనోహర్‌ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన కథనం మేరకు పుంగనూరు మండలం ఇటుకనెల్లూరుకు చెందిన ఎస్‌కే.రమణారెడ్డి 2020లో పలమనేరు రోడ్డులోని శ్రీవాసవీకళ్యాణ మండపం వద్ద ఆయన భార్య బోయకొండ మాజీ ఛైర్మన్‌ ఎస్‌.రతీదేవీ పేరుతో 10 కుంటల స్థలాన్ని ఇంటి నిర్మాణానికి కొనుగోలు చేశారు. పంచాయతీ వద్ద ప్లాన్‌ ఆమోదం తీసుకున్నారు.


ఈయన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉంటున్నారు. ఇటీవల కుప్పంలో జరిగిన చంద్రబాబు పర్యటనకు భారీ ర్యాలీగా ఇక్కడ నుంచే వెళ్లారు. త్వరలో ఇంటి నిర్మాణం చేయాలని రూ.16 లక్షలతో ప్రహరీ, రేకులషెడ్డు నిర్మించారు. రూ.1 లక్ష విలువైన ఇసుక, కంకర మిషన్‌, వైబ్రేటర్‌, గడ్డపారలు ఇతర పనిముట్లు అందులో ఉంచారు. ఈ నేపథ్యంలో వాటిని ధ్వంసం చేశారు. హైదరాబాద్‌లో ఉన్న రమణారెడ్డి విషయం తెలుసుకుని ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో చురుకుగా వ్యవహరిస్తున్నానని రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని పేర్కొ న్నారు. ఇప్పుడు ఆస్తులు ధ్వంసం చేసే స్థాయికి దిగజారారని, ఇది మంచి పద్ధతి కాద న్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.   



Updated Date - 2021-11-09T06:01:09+05:30 IST