ఎస్‌కేబీఆర్‌ కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-10-18T05:57:31+05:30 IST

ఏడు దశాబ్దా లుగా బడుగు, బలహీనవర్గాల ప్రజలకు విద్యను అం దించిన అమలాపురం ఎస్‌కేబీఆర్‌ కళాశాలను ప్రైవేటీ కరణ చేయడానికి పాలకమండలి తీసుకున్న నిర్ణ యాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండు చేశారు.

ఎస్‌కేబీఆర్‌ కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

అమలాపురం టౌన్‌, అక్టోబరు 17: ఏడు దశాబ్దా లుగా బడుగు, బలహీనవర్గాల ప్రజలకు విద్యను అం దించిన అమలాపురం ఎస్‌కేబీఆర్‌ కళాశాలను ప్రైవేటీ కరణ చేయడానికి పాలకమండలి తీసుకున్న నిర్ణ యాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండు చేశారు. ప్రభుత్వమే కళాశాలను స్వాధీనం చేసుకుని పేద వర్గాలకు ఉచితంగా ఉన్నత విద్యను అందించాలని డిమాండు చేశారు. పీడీఎస్‌ యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేవు తిరుపతిరావు ఆధ్వర్యం లో అమలాపురంలో జడ్పీ బాలుర ఉన్నత పాఠ శాలలో అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమా వేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలను తీసుకు న్నారు. ఆర్పీఐ జాతీయ కార్యదర్శి డీబీ లోక్‌ మాట్లా డుతూ ఎస్‌కేబీఆర్‌ కళాశాలను ప్రైవేటీకరణచేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సమావేశంలో ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్‌ మానటరింగ్‌ కమిటీ జిల్లా సభ్యుడు జంగా బాబూరావు, సామాజికవేత్త ఎంఏకే భీమారావు తదితరులు మాట్లాడారు. అనంతరం నిర సన ప్రదర్శన నిర్వహించారు. కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నిర్వహించకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నిర్ణయించారు.  నాయకులు మట్ట పర్తి నాగేంద్ర, బీవీవీ సత్యనారాయణ, ఎం.శ్రీను, గంటి చిరంజీవి, వడ్డి శ్యాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-10-18T05:57:31+05:30 IST