Sky-green: అమెరికాలో ఆకుపచ్చగా మారిన ఆకాశం.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్.. !

ABN , First Publish Date - 2022-07-08T00:32:39+05:30 IST

పగటి వేళ మనకు ఆకాశం నీలం రంగులో కనిపిస్తుంది. సూర్యాస్తమయ సమయాల్లో పడమటి వైపున కాస్తంత ఎర్రగానూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే.. అమెరికాలోని దక్షిణ డకోటా రాష్ట్రంలో(south Dacota) ఆగ్నేయం దిశగా కొన్ని ప్రాంతాల్లో ఆకాశం ఆకుపచ్చ రంగులో కనిపించడం ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చనీయాంశమవుతోంది.

Sky-green: అమెరికాలో ఆకుపచ్చగా మారిన ఆకాశం.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్.. !

ఎన్నారై డెస్క్: పగటి వేళ మనకు ఆకాశం నీలం రంగులో కనిపిస్తుంది. సూర్యాస్తమయ సమయాల్లో పడమటి వైపున కాస్తంత ఎర్రగానూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే.. అమెరికాలోని(USA) దక్షిణ డకోటా రాష్ట్రంలో(south Dacota) ఆగ్నేయం దిశగా కొన్ని ప్రాంతాల్లో ఆకాశం(sky) ఆకుపచ్చ(Green) రంగులో కనిపించడం ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చనీయాంశమవుతోంది. ఇలా ఎందుకు జరుగుతోందో అర్థం కాక ప్రజలు షాకైపోతున్నారు. ఈ దృశ్యాలను కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ‘‘అచ్చు సినిమాల్లో చూపించినట్టు ఉంది.. రాబోయే భయానక ఘటనలకు ఇది సంకేతమా..?’’ అంటూ కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 


అయితే..  ప్రజలు ఊహించుకుంటున్న సీన్ అక్కడ లేదని శాస్త్రవేత్తలు తేల్చేస్తున్నారు. ఆకాశం ఆకుపచ్చగా కనిపించడమనేది సాధారణ విషయమేనని చెబుతున్నారు. ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తున్నారు. నీటి శాతం ఎక్కువగా ఉన్న మేఘాల కారణంగా సూర్యకిరణాలు వక్రీకరణం చెందడం వల్ల ఇలా జరుగుతుందని క్లారిటీ ఇస్తున్నారు.  వక్రీకరణం వల్ల సప్తవర్ణ కిరణాల్లో కొన్ని రంగులే భూమికి చేరుతాయని చెప్పారు. భూమికి చేరే కిరణాలను బట్టి ఆకాశం ఆయా రంగుల్లో కనిపిస్తుందని చెబుతున్నారు. ఇక ఆకుపచ్చ రంగులో ఆకాశం ఉందంటే.. వడగళ్ల వాన పడే అవకాశాలు మెండుగా ఉంటాయనేది శాస్త్రవేత్తల అంచనా! ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు మాత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 





Updated Date - 2022-07-08T00:32:39+05:30 IST