అపోహలా?

ABN , First Publish Date - 2021-05-05T05:30:00+05:30 IST

వాతావరణం కారణంగా చర్మంలో హఠాత్తుగా మార్పులు రావడం చాలామందికి అనుభవమే. మొటిమలు, చర్మం పొడిబారడం, దురదలు, చర్మంలో మెరుపు తగ్గడం... ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి...

అపోహలా?

వాతావరణం కారణంగా చర్మంలో హఠాత్తుగా మార్పులు రావడం చాలామందికి అనుభవమే. మొటిమలు, చర్మం పొడిబారడం, దురదలు, చర్మంలో మెరుపు తగ్గడం... ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. చర్మ సంరక్షణ కోసం ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నా చాలా సందేహాలు వెంటాడుతూ ఉంటాయి. వాటిలో కొన్ని అపోహలూ ఉంటాయి. అవేమిటంటే:


  1. చాక్లెట్లు, ఆయిలీ ఫుడ్‌ తినకూడదా?: మన  శరీరంలోని సెబేషియన్‌ గ్రంథులు ఒక మైనపు పదార్థాన్ని విడుదల చేస్తూ ఉంటాయి. దాన్ని ‘సీబమ్‌’ అంటారు. హార్మోన్లలో సమతుల్యత లోపించడ వల్ల చర్మం నుంచి సీబమ్‌ అధికంగా విడుదలవుతుంది. మొటిమలకు ఇదే కారణం. ఒక ఆహార పదార్థం తీసుకోవడం తగ్గించినంత మాత్రాన మొటిమలు పెరగడమో, తగ్గడమో జరిగే అవకాశం లేదు.
  2. ‘విటమిన్‌-ఇ’తో మచ్చలు మాయం: చర్మం ఆరోగ్యాన్ని పెంచడంలో ‘విటమిన్‌-ఇ’ అద్భుతంగా పని చేస్తుంది. దీనివల్ల చర్మానికి పోషకాలు కూడా అందుతాయి. కానీ ముఖం మీద మచ్చలనూ, గాట్లనూ మాయం చేసే సామర్థ్యం ‘విటమిన్‌-ఇ’కి ఉందని శాస్త్రీయంగా రుజువు కాలేదు. మచ్చలూ, గాట్లూ కనుమరుగు కావలంటే డెర్మటాలజి్‌స్టను సంప్రతించి, చికిత్స తీసుకోవాలి.
  3. ఆ మాస్క్‌ ఎక్కువసేపు ఉంచితే: ముఖానికి ముల్తానా మట్టితో ఫేస్‌ మాస్క్‌ వేసుకొని, వీలైనంత ఎక్కువసేపు ఉంచితే మంచి ఫలితం ఉంటుందన్నది చాలామంది భావన. అయితే ఆ మాస్క్‌ కాస్త తడిగా ఉన్నప్పుడే దాని ప్రభావం ఉంటుంది. అది పూర్తిగా ఎండిపోయిన తరువాత కూడా తీసెయ్యకపోతే, చర్మానికి తేమ అందడానికి బదులు మరింత పొడిబారిపోతుంది. 
  4. ఎస్‌పిఎఫ్‌ ఎక్కువ ఉండాలా?: వేసవి కాలంలో ఎండ ప్రభావం నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి సన్‌ స్ర్కీన్‌ మీద ఆధారపడుతూ ఉంటాం. ఎక్కువ ఎస్‌పిఎఫ్‌ ఉన్న సన్‌ స్ర్కీన్లు మంచివనీ చెబుతూ ఉంటారు. అది కొంతవరకూ వాస్తవమే. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, 30 ఎస్‌పిఎఫ్‌ ఉన్న సన్‌ స్ర్కీన్‌ వాడితే అది 97 శాతం అలా్ట్ర వయొలెట్‌ కిరణాలను నిరోధిస్తుంది. కానీ ఎక్కువ సేపు ఎండలో ఉండాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఎక్కువ ఎస్‌పిఎఫ్‌ ఉన్న సన్‌ స్ర్కీన్‌ కావాలి. నీడ పట్టున ఉన్న వాళ్ళకు అంతగా అవసరం ఉండదు. ప్రత్యేకించి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల మధ్య... అధిక సమయం ఎండలో ఉండాల్సి వస్తే అధిక ఎస్‌పిఎఫ్‌ ఉన్న సన్‌ స్ర్కీన్‌ ఉపయోగించవచ్చు. 

Updated Date - 2021-05-05T05:30:00+05:30 IST