చర్మ సంరక్షణ సీజన్‌కు తగ్గట్టుగా...

ABN , First Publish Date - 2020-10-22T06:15:03+05:30 IST

సీజన్‌తో పాటు చర్మసంరక్షణలో మార్పులు చేసుకోవడం చాలా అవసరం. వాతావరణంలో మార్పులు చర్మం మీద ప్రభావం చూపుతాయి. ఈ సీజన్‌లో అందాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలంటే...

చర్మ సంరక్షణ సీజన్‌కు తగ్గట్టుగా...

సీజన్‌తో పాటు చర్మసంరక్షణలో మార్పులు చేసుకోవడం చాలా అవసరం. వాతావరణంలో మార్పులు చర్మం మీద ప్రభావం చూపుతాయి. ఈ సీజన్‌లో అందాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలంటే...

  1. ఒక టీస్పూన్‌ చొప్పున కాఫీ పొడి, కొబ్బరినూనె, సగం టీస్పూన్‌ బియ్యప్పిండి తీసుకొని ఫేస్‌ప్యాక్‌ తయారుచేసుకోవాలి. ఈ ఫ్యాక్‌ను ముఖం, మెడ చుట్టూ వేళ్లతో మర్దనా చేసినట్టు రాసుకోవాలి. 
  2. పది నిమిషాల తరువాత వేడినీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్‌ప్యాక్‌ మృతకణాలను తొలగించి, చర్మానికి తాజాదనాన్ని, బిగుతుగుణాన్ని ఇస్తుంది. కొబ్బరినూనెలోని ఫ్యాటీఆమ్లాలు చర్మానికి తేమను అందిస్తాయి. 
  3. కాఫీపొడిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. బియ్యప్పిండి చర్మానికి గట్టిదనాన్ని ఇస్తుంది. వారం రోజులు ఇలాచేస్తే చర్మం కాంతిమంతంగా మారుతుంది.

Updated Date - 2020-10-22T06:15:03+05:30 IST