ఆకాశంలో ఈతకొలను!

Apr 30 2021 @ 00:00AM

రకరకాల స్విమ్మింగ్‌పూల్‌లు చూసి ఉంటారు. కానీ ఈ స్విమ్మింగ్‌ పూల్‌ మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకో తెలుసా? ఇది ఆకాశంలో తేలియాడుతున్నట్టుగా ఉంటుంది. అందుకే దీన్ని స్కై పూల్‌ అని పిలుస్తున్నారు. వచ్చే నెలలో ప్రారంభించనున్న ఆ స్కై పూల్‌ విశేషాలివి.


  1. బ్రిటన్‌లోని నైన్‌ ఎల్మ్స్‌ బిజినెస్‌ జిల్లాలో రెండు నివాస భవనాల మధ్యన నిర్మించిన ఈతకొలను ఇది. ఇంజనీర్లు సవాలుగా తీసుకుని దీనిని నిర్మించారు.. రెండు పది అంతస్తుల భవనాల పై భాగాలను కలుపుతూ, గ్లాసుతో ఈ ఈతకొలనును నిర్మించారు. ఈ పూల్‌లో స్విమ్‌ చేస్తుంటే ఆకాశంలో ఈత కొడుతున్నట్టుగా అనిపిస్తుంది
  2. పూర్తిగా పారదర్శకంగా ఉండే ఈ పూల్‌లో ఈత కొట్టాలంటే కాస్తంత గుండె ధైర్యం కూడా కావాల్సిందే. ఈ పూల్‌లో 1,48,000 గ్యాలన్ల నీరు పడుతుంది.
  3. ఈ పూల్‌లో స్విమ్‌ చేస్తూ హౌజ్‌ ఆఫ్‌ పార్లమెంట్‌, లండన్‌ సిటీ స్కైలైన్‌లను వీక్షించవచ్చు. 
  4. ఆధునిక సాంకేతికత, నిర్మాణరంగ ఆవిష్కరణల వల్లనే ఈ అద్భుతమైన ఈత కొలను సాధ్యమయిందని ఈ పూల్‌ను నిర్మించిన హెచ్‌ఎఎల్‌ ఆర్కిటెక్ట్స్‌ ప్రతినిధులు చెబుతున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.