పాఠశాల నుంచి గ్రానైట్‌ పలకల తరలింపు అడ్డగింత

ABN , First Publish Date - 2020-12-04T05:16:01+05:30 IST

మండలంలోని జోగంపేట ప్రాథమిక పాఠశాల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా గ్రానైట్‌ పలకలు తరలిస్తుం డడాన్ని పాఠశాల పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ వనుం శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌ చిటికెల వరహాబాబు ఆధ్వర్యంలో పలువురు గ్రామస్థులు గురువారం సాయంత్రం అడ్డుకున్నారు.

పాఠశాల నుంచి గ్రానైట్‌ పలకల తరలింపు అడ్డగింత
గ్రానైట్‌ పలకలను ఎక్కించిన వ్యాన్‌ను అడ్డుకుంటున్న గ్రామస్థులు

 ‘నాడు- నేడు’ పనుల కోసం జోగంపేట ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం కొనుగోలు

 పనులు పూర్తి కాకుండానే విక్రయించడంతో గ్రామస్థులు అభ్యంతరం

గొలుగొండ, డిసెంబరు 3 : మండలంలోని జోగంపేట ప్రాథమిక పాఠశాల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా గ్రానైట్‌ పలకలు తరలిస్తుం డడాన్ని పాఠశాల పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ వనుం శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌ చిటికెల వరహాబాబు ఆధ్వర్యంలో పలువురు గ్రామస్థులు గురువారం సాయంత్రం అడ్డుకున్నారు. ఈ పాఠశాలలో నాడు- నేడులో భాగంగా చేపట్టే పనుల కోసం హెచ్‌ఎం ఈ పలకలను కొనుగోలు చేశారు. అయితే  పనులు పూర్తి కాకుండానే హెచ్‌ఎం వీటిని విక్రయించడంతో సాయంత్రం వ్యాన్‌లో గ్రానైట్‌ పలకలను సదరు యజామాని ఎక్కించారు. ఈ విషయం తెలుసు కున్న గ్రామస్థులు పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ దృష్టికి ఈ విషయాన్ని తీసుకు వెళ్లారు. దీంతో ఆయన వచ్చి అడ్డగించారు. దీనిపై ఇన్‌చార్జి ఎంఈవో అమృత్‌కుమార్‌ను వివరణ కోరగా, గ్రానైట్‌ తరలింపుపై తమకు ఎటువంటి సమాచారం లేదన్నారు. ఎస్‌ఐ నారాయ ణరావు వాహనాన్ని స్వాధీనం పర్చుకుని స్టేషన్‌కు తరలించారు. 


Updated Date - 2020-12-04T05:16:01+05:30 IST