ఈ ఫొటోలోని చెప్పుల విలువ రూ.24 లక్షల పైనే.. ఇంత ఖరీదేంటని అవాక్కవుతున్నారా..? అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2022-05-13T21:27:18+05:30 IST

పైన ఫొటోలో కనిపిస్తున్న చెప్పుల విలువ రూ.24లక్షలు. ఏంటి.. ఆశ్చర్యంగా ఉందా? నమ్మశక్యంకానప్పటికీ ఇది నిజం. అయితే.. చాలా సింపుల్‌గా కనిపిస్తున్న ఆ చెప్పులకు అంత ఖరీదేంటీ? ఇంతకూ వాటి ప్రత్యేక

ఈ ఫొటోలోని చెప్పుల విలువ రూ.24 లక్షల పైనే.. ఇంత ఖరీదేంటని అవాక్కవుతున్నారా..? అసలు కథేంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: పైన ఫొటోలో కనిపిస్తున్న చెప్పుల విలువ రూ.24లక్షలు. ఏంటి.. ఆశ్చర్యంగా ఉందా? నమ్మశక్యంకానప్పటికీ ఇది నిజం. అయితే.. చాలా సింపుల్‌గా కనిపిస్తున్న ఆ చెప్పులకు అంత ఖరీదేంటీ? ఇంతకూ వాటి ప్రత్యేకత ఏంటి అని ఆలోచిస్తున్నారా? అది తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే. 


దుబాయ్ నుంచి బయల్దేరిన స్పైస్‌జెట్ విమానం అమృత్‌సర్‌లోని శ్రీ గురు రామ్‌దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది. ఈ క్రమంలో ఫ్లైట్ దిగిన ఓ యువకుడు.. చాలా సింపుల్‌గా సెక్యురిటీ వద్దకు చేరుకున్నాడు. అధికారులు కూడా అందరిలాగానే అతడికి కూడా చెక్ చేశారు. అయితే.. అతడి చెప్పులను చూసి అనుమానం వ్యక్తం చేసిన అధికారులు.. క్షుణ్ణంగా చెక్ చేశారు. ఈ క్రమంలోనే అతడి చెప్పుల్లో రెండు తెల్లని ప్యాకెట్లను గుర్తించారు. అనంతరం ఆ ప్యాకెట్‌లో పదార్థాన్ని బంగారం పెస్ట్‌గా గుర్తించిన అధికారులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. 



460 గ్రాముల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నించిన కారణంగా అతడిపై కస్టమ్స్ కేసు నమోదు చేశారు. ఆ బంగారం విలువ సుమారు రూ.24లక్షల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. విదేశాల నుంచి ఇండియాలోకి బంగారాన్ని పేస్ట్ రూపంలో అక్రమ రవాణా చేయడం 2018 నుంచి ప్రారంభమైంది. బంగారాన్ని ప్రత్యేక పద్ధతుల్లో పేస్ట్‌గా మార్చడం ద్వారా మెటల్ డిటెక్టర్ కూడా వాటిని గుర్తించలేవు. దీన్ని అవకాశంగా మలుచుకుని కొందరు కేటుగాళ్లు బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. 


Read more