ఆరోగ్య రక్షణకు వీటితో మేలు!

ABN , First Publish Date - 2022-08-13T05:30:00+05:30 IST

ఆరోగ్యంపై దృష్టిసారించే జనాలు పెరగడం సమాజానికి మంచిదే. వీటిలో ఎలకా్ట్రనిక్‌ డివైస్‌లు కూడా తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. స్మార్ట్‌ వాచీల నుంచి స్మార్ట్‌వేరబుల్స్‌ వరకు అన్నీ

ఆరోగ్య రక్షణకు వీటితో మేలు!

ఆరోగ్యంపై దృష్టిసారించే జనాలు పెరగడం సమాజానికి మంచిదే. వీటిలో ఎలకా్ట్రనిక్‌ డివైస్‌లు కూడా తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. స్మార్ట్‌ వాచీల నుంచి స్మార్ట్‌వేరబుల్స్‌ వరకు అన్నీ ఇందులోకి వస్తాయి. ఎక్సర్‌సైజ్‌లు మొదలుకుని బరువు తగ్గడం, చక్కగా నిద్రపోవడం వరకు అన్నింటికీ అనువుగా ఈ యాప్‌లు పనిచేస్తాయి. ట్రాక్‌ చేసి అవసరానుగుణంగా హెచ్చరిస్తూ ఉంటాయి. ఒకరకంగా ఇవన్నీ లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు తోడ్పడతాయి. అయితే వీటిని ఎంపిక చేసుకునే ముందు మన అవసరాలు ఏమిటి అనేది లిస్ట్‌ చేసుకోవాలి. వాటికి తగ్గట్టు యాప్‌ను ఎంపిక చేసుకోవాలి. సదరు యాప్‌లకు డివైస్‌ సపోర్ట్‌ను చూసుకోవాలి. ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ లేదంటే స్మార్ట్‌ వాచ్‌ ఎంత సౌకర్యంగా ఉంటే అంత మంచి అనుభవం కలుగుతుంది. ఈ రోజుల్లో పలు యాప్‌లతో డివైస్‌లు వస్తున్నాయి. అందులో మీకు ఏవి అవసరం అన్నది ఎంపిక చేసుకోవాలి. తదుపరి వాటిని యాప్‌ డాష్‌బోర్డ్‌ నుంచి కస్టమైజ్‌ చేసుకోవాలి. అలాగే వ్యాయామం నుంచి జాగింగ్‌, ఆఫీసుకు వెళ్ళేటప్పుడు వాటిని ధరించాలి. దాన్నో ఎలకా్ట్రనిక్‌ పార్టనర్‌గా భావించాలి. 


అప్పుడే ఆరోగ్యానికి సంబంధించి ట్రాకింగ్‌ ఆపై హెచ్చరికలకు వీలవుతుంది. నడిచిన దూరం తదితరాలన్నీ తెలుస్తూ ఉంటాయి. డివైస్‌తో వీటిని లింక్‌ చేసుకుంటే మ్యూజిక్‌ వినొచ్చు. నోటిఫికేషన్స్‌ చదువుకోవచ్చు. మెసేజెస్‌ తదితరాలను చూసుకోవచ్చు. అంటే మల్టిపుల్‌ ప్రయోజనాలను అందుకోవచ్చు.   

Updated Date - 2022-08-13T05:30:00+05:30 IST