అవగాహన కల్పించండిలా..!

ABN , First Publish Date - 2021-09-06T05:30:00+05:30 IST

పిల్లల చేతుల్లో స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు మామూలు విషయమైపోయింది. అయితే సైబర్‌ నేరాలు పెరిగిపోతున్న ఈ సమయంలో పిల్లలకు సోషల్‌మీడియా, నెట్‌ వాడకంపై అవగాహన కల్పించాలి. ఏం చేయాలంటే...

అవగాహన కల్పించండిలా..!

పిల్లల చేతుల్లో స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు మామూలు విషయమైపోయింది. అయితే సైబర్‌ నేరాలు పెరిగిపోతున్న ఈ సమయంలో పిల్లలకు సోషల్‌మీడియా, నెట్‌ వాడకంపై అవగాహన కల్పించాలి. ఏం చేయాలంటే...


  1. సైబర్‌ భద్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పిల్లలకు వివరించాలి. టెక్నాలజీని ఎంత బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలో నేర్పాలి.  
  2. పిల్లలు కొన్ని యాప్స్‌, వెబ్‌సైట్స్‌లో వ్యక్తిగత వివరాలు పొందుపరుస్తుంటారు. దీనివల్ల ఎదురయ్యే ప్రమాదాలను వాళ్లకు వివరించాలి. కుటుంబసమాచారం, బ్యాంకు వివరాలు, పుట్టిన తేదీల వివరాలు, పూర్తి పేర్లు, వ్యక్తిగత ఫోన్‌నెంబర్లు, డెబిట్‌కార్డుల వివరాలు ఎక్కడా పొందుపరచకూడదని చెప్పాలి. 
  3. పిల్లల ఆన్‌లైన్‌ యాక్టివిటీపై తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంచాలి. సోషల్‌ మీడియా అకౌంట్స్‌ ఉన్నట్లయితే వాళ్ల అకౌంట్స్‌ను ఫాలో కావాలి. పిల్లలు తరచుగా చూస్తున్న వెబ్‌సైట్లను పరిశీలించాలి. వారి సోషల్‌ మీడియా అకౌంట్స్‌ పాస్‌వర్డ్స్‌ను అడిగి తెలుసుకోవాలి.
  4. ఆన్‌లైన్‌లో ఎలాంటి కంటెంట్‌ను షేర్‌ చేసుకోవచ్చు. ఎలాంటి కంటెంట్‌ షేర్‌ చేయకూడదో చెప్పాలి. వాళ్లు షేర్‌ చేస్తున్న కంటెంట్‌ వివరాలు అడిగి తెలుసుకోవాలి. 
  5. సైబర్‌ నేరాలు, సైబర్‌ లా గురించి తెలియజేయాలి. ఈ సమయంలో పిల్లలు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇవ్వాలి. 

Updated Date - 2021-09-06T05:30:00+05:30 IST