18 జిబి రామ్‌తో స్మార్ట్‌ఫోన్‌

ABN , First Publish Date - 2021-03-06T06:16:13+05:30 IST

18జిబి రామ్‌తో స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు కల కాదు... వాస్తవం. టెన్సెంట్‌ గేమ్స్‌తో కలసి నౌబియా ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తోంది. బైటకు వస్తున్న రెంటిలో ఒకటి రెడ్‌ మేజిక్‌ 6. దీనికి 18 జిబి రామ్‌ ఉంటుంది. ఈ స్థాయిలో రామ్‌ ఉన్న ఫోన్‌ ప్రపంచంలో ఇదే

18 జిబి రామ్‌తో స్మార్ట్‌ఫోన్‌

18జిబి రామ్‌తో స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు కల కాదు... వాస్తవం. టెన్సెంట్‌ గేమ్స్‌తో కలసి నౌబియా ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తోంది. బైటకు వస్తున్న రెంటిలో ఒకటి రెడ్‌ మేజిక్‌ 6. దీనికి 18 జిబి రామ్‌ ఉంటుంది. ఈ స్థాయిలో రామ్‌ ఉన్న ఫోన్‌ ప్రపంచంలో ఇదే మొదటిది.


రెడ్‌ మేజిక్‌ 6,  రెడ్‌ మేజిక్‌ 6 ఫీచర్స్‌

ఈ రెండు గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్లలోనూ 165హెచ్‌ జెడ్‌ రిఫ్రష్‌ రేటుతో అమోల్డ్‌ స్ర్కీన్‌లు ఉన్నాయి. టచ్‌ కొరియోగ్రాఫర్‌ టెక్నాలజీ ఉంది ఇందులో ఉండే  ఇంటెలిజెంట్‌ అడాప్టివ్‌ టెక్నాలజీ,  ఫోన్‌తో యూజర్‌  చేసే కార్యకలాపాలను అనుసరించి రిఫ్రష్‌ రేటును కచ్చితంగా తెలియజేస్తుంది. ఫలితంగా బ్యాటరీ ఆదాకు తోడు వీక్షించే అనుభవం రిచ్‌గా ఉంటుంది. స్ర్కీన్‌ టు బాడీ నిష్పత్తి 91.28 శాతం కాగా గేమ్‌లో భాగంగా హిట్‌ అండ్‌ ప్లేలో వేగం ఉంటుంది. సిపిహెచ్‌వై- డిఎస్‌ఐ టెక్నాలజీతో ఇమేజెస్‌లో హై క్వాలిటీ రాబట్టవచ్చు. ఇరవై నుంచి యాభై శాతం తక్కువ పవర్‌తోనే ఇది సాధ్యమవుతుంది. 


రెడ్‌మేజిక్‌ 6సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్‌లో సరికొత్త ఐసిఇ సిక్స్‌ డైమన్షనల్‌ కూలింగ్‌ సిస్టమ్‌ ఉంది. ఇన్‌బిల్ట్‌ టర్బోఫాన్‌ ఉంది.  హైస్పీడ్‌ అంటే 20,000 ఆర్‌పిఎం దీంతో సాధ్యం. కెనయన్‌ ఎయిర్‌డక్ట్‌ డిజైన్‌తో ఎయిర్‌ఫ్లో బాగుంటుంది. 400హెచ్‌జడ్‌ డ్యూయల్‌ ప్రొ షోల్డర్‌ ట్రిగ్గర్స్‌, క్లాసిక్‌ గేమ్‌ డిజైన్‌, ఆర్‌జిబి స్ట్రిప్‌ ఫోన్‌ చుట్టూ ఉంటుంది. 


రెడ్‌ మేజిక్‌ 6 స్మార్ట్‌ ఫోన్లు బ్లాక్‌, పల్స్‌ రంగుల్లో రూ.42,760కి,  రెడ్‌ మేజిక్‌ 6 ప్రొ స్మార్ట్‌ ఫోన్లు బ్లాక్‌, సిల్వర్‌ రంగుల్లో రూ.49,510కి లభిస్తాయి. 

ఈ రెండూ 6.8 ఇంచ్‌ ఫుల్‌ హెచ్‌డి ప్లస్‌ అమోల్డ్‌ డిస్‌ప్లే 1080 ఇంటు 2400 పిక్సల్‌ రిజల్యూషన్‌తో ఉన్నాయి. హై ఎండ్‌ ఆక్టా-కోర్‌ క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌ పవర్‌ కలిగి ఉంటుంది. 8/ 12/ 16/ 18 జిబి రామ్‌ అలాగే 128/ 256/ 512 జీబీ స్టోరేజ్‌ ఆప్షన్స్‌ ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై ఈ డివైస్‌ పనిచేస్తాయి.

Updated Date - 2021-03-06T06:16:13+05:30 IST