దాహం తీర్చాలని అడుగుతున్న మొక్కలు.. ఆశ్చర్యపరుస్తున్న కొత్త టెక్నాలజీ!

ABN , First Publish Date - 2022-05-10T17:03:48+05:30 IST

మొక్కలకు నీరు ఎప్పుడు అవసరమో తెలుసుకోవడం...

దాహం తీర్చాలని అడుగుతున్న మొక్కలు.. ఆశ్చర్యపరుస్తున్న కొత్త టెక్నాలజీ!

మొక్కలకు నీరు ఎప్పుడు అవసరమో తెలుసుకోవడం చాలా కష్టమైనపని. అయితే ఇకపై ఇది మరింత సులభంకానుంది. శాస్త్రవేత్తలు మొక్కల కోసం ఒక ప్రత్యేక స్మార్ట్ వాచ్‌ను అభివృద్ధి చేశారు. ఇది ఆకుల ద్వారా ఆ మొక్కకు నీరు అవసరమోకాదో తెలియజేస్తుంది. మొక్కకు నీటి కొరత లేకుండా ఉండేలా ఈ స్మార్ట్‌వాచ్ సూచనలు అందజేస్తుంది. బ్రెజిల్‌లోని బ్రెజిలియన్ నానోటెక్నాలజీ నేషనల్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు దీనిని అభివృద్ధి చేశారు. డెయిలీ మెయిల్ నివేదిక తెలిపిన వివరాల ప్రకారం ఈ స్మార్ట్‌వాచ్‌ మొక్కలలో నీటి మట్టం ఎంత ఉందో గుర్తిస్తుంది. మొక్కలోని నీటి స్థాయిని గుర్తించేందుకు ఆకులకు సెన్సార్‌ని అమర్చారు. ఈ సెన్సార్ దానిలోని తేమ స్థాయిని తనిఖీ చేస్తుంది. అది ఇచ్చిన సమాచారానికి అనుగుణంగా మొక్కలను సంరక్షించవచ్చు. 

Read more