SpiceJet విమానంలో పొగ...ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్

ABN , First Publish Date - 2022-07-02T15:49:30+05:30 IST

స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో దాన్ని తిరిగి ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు....

SpiceJet విమానంలో పొగ...ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్

సురక్షితంగా దిగిన విమాన ప్రయాణికులు 

న్యూఢిల్లీ:స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో దాన్ని తిరిగి ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఐదువేల అడుగుల ఎత్తులో వెళుతున్న స్పైస్ జెట్ విమానం క్యాబిన్‌లో పొగ వెలువడటంతో దాన్ని ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానంలోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని స్పైస్‌జెట్‌ ప్రతినిధి తెలిపారు.ఢిల్లీ నుంచి జబల్‌పూర్‌ నగరానికి వెళుతున్న స్పైస్‌జెట్ విమానం క్యాబిన్‌లో పొగలు రావడంతో పైలెట్ శనివారం ఉదయం తిరిగి ఢిల్లీ విమానాశ్రయానికి తీసుకువచ్చారని విమానాశ్రయ అధికారులు చెప్పారు. 


పొగ నిండిన క్యాబిన్ చిత్రాన్ని ట్విట్టరులో పోస్టు చేశారు. గడచిన 15 రోజుల్లో స్పైస్‌జెట్ విమానానికి ఇది రెండో అత్యవసర ల్యాండింగ్.జూన్ 19వతేదీన 185 మంది ప్రయాణికులతో ఢిల్లీకి బయలుదేరిన విమానం పక్షి ఢీకొనడంతో దాని ఎడమ ఇంజన్ మంటల్లో చిక్కుకోవడంతో టేకాఫ్ అయిన వెంటనే పాట్నాలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.దీంతో ప్రయాణికులందరినీ సురక్షితంగా విమానం నుంచి బయటికి తరలించినట్లు స్పైస్ జెట్ అధికారులు తెలిపారు.

Updated Date - 2022-07-02T15:49:30+05:30 IST