ధూమపానం అలవాటు మానుకున్నా.. ఊపిరితిత్తుల్లో ఉండిపోయే వీటిని తొలగించాలంటే..

Published: Thu, 21 Apr 2022 13:58:26 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ధూమపానం అలవాటు మానుకున్నా.. ఊపిరితిత్తుల్లో ఉండిపోయే వీటిని తొలగించాలంటే..

ఆంధ్రజ్యోతి(20-04-2022)

ధూమపానం తాలూకు నికోటిన్‌ ఊపిరితిత్తుల్లో పేరుకుపోతూ ఉంటుంది. ఈ అలవాటును మానుకున్నా, ఎన్నో నెలల తరబడి టాక్సిన్లు ఊపిరితిత్తుల్లోనే ఉండిపోతూ ఉంటాయి. వాటిని బయటకు తెప్పించాలంటే ఈ చిట్కాలు పాటించాలి.


నీళ్లు: వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి. నిమ్మరసం లేదా కామోమిల్‌, గ్రీన్‌ టీలు కూడా ఊపిరితిత్తుల్లోని టాక్సిన్లు బయటకు వెళ్లిపోడానికి సహాయపడతాయి.


పోషకాలు, పీచు: మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఇందుకోసం పీచు, సరిపడా పోషకాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. 


ఇవి వద్దు: మద్యం, కాఫీ, టీ, శీతల పానీయాలు మానుకోవాలి.


వ్యాయామం: కార్డియో వ్యాయామాలతో ఊపిరితిత్తులు బలపడతాయి. ఫలితంగా టాక్సిన్లు వేగంగా శరీరం నుంచి వెళ్లిపోతాయి.


ధూమపానం: టాక్సిన్లను సమూలంగా శరీరం నుంచి తొలగించాలంటే ధూమపానానికి శాశ్వతంగా దూరమవ్వాలి. ఈ అలవాటును మానుకోవడం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.