Goa Bar contoversy: స్మృతి ఇరానీ కుమార్తెకు ఊరట

ABN , First Publish Date - 2022-08-02T02:02:34+05:30 IST

గోవా బార్ వివాదంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురు జోయిష్‌కు..

Goa Bar contoversy: స్మృతి ఇరానీ కుమార్తెకు ఊరట

న్యూఢిల్లీ: గోవా బార్ వివాదం (Goa bar controversy)లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) కూతురు జోయిష్‌కు ఊరట లభించింది. స్మృతి ఇరానీ కానీ, ఆమె కుమార్తె జోయిష్ కానీ దానికి యజమానులు కారని ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు తెలిపింది. వారికి అసలు లైసెన్సులే జారీ కాలేదని, లైసెన్స్‌ల కోసం ఎన్నడూ దరఖాస్తు కూడా చేసుకోలేదని చెప్పింది. రెస్టారెంట్ ఉన్న భూమి కూడా స్మతి ఇరానీ, జోయిష్ ఇరానీలకు చెందినది కాదని తెలిపింది. స్మృతి ఇరానీ కూతురు గోవాలో అక్రమంగా బార్ నిర్వహిస్తోదంటూ కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్‌, పవన్ ఖేరా, నెట్టా డీసౌజాలు ఇటీవల ఆరోపణలు చేయడం సంచలనమైంది. దీనిపై స్మృతి ఇరానీ  రూ.2 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో సదరు డాక్యుమెంట్లను హైకోర్టు పరిశీలించింది.


''కాంగ్రెస్‌ నేతలు చేసిన ప్రకటనలు అపవాదు వేయాలనే దురుద్దేశంతో బోగస్‌గా అనిపిస్తున్నాయి. ప్రజల దృష్టిలో పడేందుకు కొందరిని టార్గెట్‌ చేసుకున్నట్లు కనిపిస్తోంది'' అని హైకోర్టు పేర్కొంది. కాంగ్రెస్‌ నేతలు తమ ట్వీట్లను సామాజిక మాద్యమాల నుంచి 24 గంటల్లోగా తొలగించాలని ఇప్పటికే కోర్టు ఆదేశాలిచ్చింది.

Updated Date - 2022-08-02T02:02:34+05:30 IST