ఆ గుట్టు విప్పాలి: Satyendar jain అంశంపై Kejriwalను ప్రశ్నించిన Smriti irani

ABN , First Publish Date - 2022-06-01T19:18:37+05:30 IST

షెల్ కంపెనీలు-ఇండో మెటాలిక్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సత్యేంద్ర యజమాని అనేది వాస్తవమేనా? అలాగే మాంగళ్యాతన్ ప్రాజెక్స్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని నడిపిస్తుంది ఆయన భార్యేనా? ఇవి కాకుండా సత్యేంద్ర జైన్ కుటుంబ సభ్యుల ద్వారా..

ఆ గుట్టు విప్పాలి: Satyendar jain అంశంపై Kejriwalను ప్రశ్నించిన Smriti irani

న్యూఢిల్లీ: అవినీతి కేసులో రెండు రోజుల క్రితం అరెస్టైన ఢిల్లీ హోంమంత్రి(Delhi home minister), ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) నేత సత్యేంద్ర జైన్‌(Satyendar jain)ను దేశద్రోహి అంటూ కేంద్రమంత్రి(Union Minister) స్మృతి ఇరానీ(Smriti irani) తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. అంతే కాకుండా అలాంటి వ్యక్తిని ఇంకా ఎన్ని రోజులు వెనకేసుకొస్తారని, ఎంత మందిని కాపాడతారని ఢిల్లీ ముఖ్యమంత్రి(Delhi Chief Minister), ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)ను ఆమె ప్రశ్నించారు. బుధవారం మీడియాతో స్మృతి మాట్లాడుతూ ఆప్‌పై ఢిల్లీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.


‘‘షెల్ కంపెనీలు-ఇండో మెటాలిక్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సత్యేంద్ర యజమాని అనేది వాస్తవమేనా? అలాగే మాంగళ్యాతన్ ప్రాజెక్స్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని నడిపిస్తుంది ఆయన భార్యేనా? ఇవి కాకుండా సత్యేంద్ర జైన్ కుటుంబ సభ్యుల ద్వారా 4 షెల్ కంపెనీల్లో 16.39 కోట్లు బదిలీ అయ్యాయి. దీనిపై కేజ్రీవాల్ సమాధానం చెప్పాలి. ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్న వాదనలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. షెల్ కంపెనీల్లో జరిగిన హవాలాపై ఆప్ నుంచి స్పష్టత రావాలి’’ అని స్మృతి ఇరానీ అన్నారు.

Updated Date - 2022-06-01T19:18:37+05:30 IST