చినబండిరేవులో టేకు దిమ్మెల స్మగ్లింగ్‌

ABN , First Publish Date - 2021-07-27T05:02:25+05:30 IST

: దుమ్ముగూడెం అటవీరేంజి పరిధి చినబండిరేవు పీహెచ్‌సీ పరిసరాల్లో గుర్తు తెలియని కొందరు స్మగ్లర్లు ఎనిమిది భారీ సైజు టేకు దిమ్మెలను సోమవారం వదిలి వెళ్లారు.

చినబండిరేవులో టేకు దిమ్మెల స్మగ్లింగ్‌

 దుమ్ముగూడెం, జూలై 26: దుమ్ముగూడెం అటవీరేంజి పరిధి చినబండిరేవు పీహెచ్‌సీ పరిసరాల్లో గుర్తు తెలియని కొందరు స్మగ్లర్లు ఎనిమిది భారీ సైజు టేకు దిమ్మెలను సోమవారం వదిలి వెళ్లారు. స్థానిక ఉపాధ్యాయుడి ఇంటి సమీపంలో పది అడుగుల  భారీ టేకు దిమ్మెలను ట్రాక్టరుపై తీసుకొచ్చారు. వీటిని అక్కడ వదిలి వెళ్లడం స్థానికులను సైతం ఆశ్చర్య చకితులను చేసింది. ఈ విషయమై రేంజి అధికారి కనకమ్మకు సమాచార మందించగా, సంబందిత సెక్షను అధికారిని అక్కడకు పంపించి దిమ్మెలను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.  

Updated Date - 2021-07-27T05:02:25+05:30 IST