Viral Video: బాబోయ్.. మహిళ చెవిలోకి దూరిన పాము.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.. చివరికి ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-09-13T01:18:52+05:30 IST

ఇప్పటి వరకు పాములకు సంబంధించిన అనేక వీడియోలను, వార్తలను ఇంటర్నెట్‌లో చూసుంటారు. కానీ ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.. వాటికి పూర్తిగా భిన్నంగా ఉంది. ఎందుకంటే.. ఓ పాము ఏకంగా మహిళ చెవిలో(Snake Gets Stuck In Womans Ear) దూరింది. వినడానికి విచిత్రంగా ఉన్నా.. వీడియోలోని

Viral Video: బాబోయ్.. మహిళ చెవిలోకి దూరిన పాము.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.. చివరికి ఏమైందంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఇప్పటి వరకు పాములకు సంబంధించిన అనేక వీడియోలను, వార్తలను ఇంటర్నెట్‌లో చూసుంటారు. కానీ ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.. వాటికి పూర్తిగా భిన్నంగా ఉంది. ఎందుకంటే.. ఓ పాము ఏకంగా మహిళ చెవిలో(Snake Gets Stuck In Womans Ear) దూరింది. వినడానికి విచిత్రంగా ఉన్నా.. వీడియోలోని దృశ్యాలను చూస్తే.. నిజమనే భావనే కలుగుతుంది. అయితే.. ఈ క్రమంలో స్పందిస్తున్న నెటిజన్లు.. రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. 


వీడియోలోని దృశ్యాల ప్రకారం.. ఓ మహిళ తన చెవిలో పాము దూరటంతో ఆసుపత్రికి వచ్చింది. అక్కడ ఆమె సమస్య విని వైద్యులు వెంటనే.. స్పందించారు. ఆమెను బెడ్‌పై పడుకోబెట్టి.. క్లిప్‌ల సహాయంతో చెవిలోంచి పామును బయటికి తీయడానికి అన్ని టెక్నిక్‌లను వాడారు. పాము మొత్తం శరీర భాగం చెవిలో ఉండి.. తల మాత్రమే బయటకు కనిపిస్తూ ఉండటంతో.. గ్లౌజులు ధరించి మరీ.. దాన్ని బయటకు లాగేయడానికి డాక్టర్ పడుతున్న శ్రమను వీడియోలో చూడవచ్చు. అయితే.. పామును మహిళ చెవిలోంచి తొలగించారా లేదా అనే విషయం తెలియకముందే వీడియో పూర్తవుతుంది. 3.49 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేయగా.. అది ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియో(Video)ను 87వేల మంది వీక్షించారు. ఈ క్రమంలో స్పందిస్తున్న కొందరు నెటిజన్లు.. ఆ వీడియో ఫేక్ అంటూ కామెంట్స్ చేస్తుంటే మరికొందరేమో.. ఆ మహిళ బాధను తలచుకుంటూ జాలి పడుతున్నారు. 





Updated Date - 2022-09-13T01:18:52+05:30 IST