పాఠశాలలో పాము హల్‌చల్‌

ABN , First Publish Date - 2022-04-27T05:44:37+05:30 IST

విద్యార్థులను పాముల భయం వీడడం లేదు. ఇటీవల కురుపాం సంఘటన కళ్లెదుటే మెదలుతుంటే, తాజాగా కొమరాడ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాల/ కళాశాలలో మంగళవారం నాగుపాము హల్‌చల్‌ చేసింది.

పాఠశాలలో పాము హల్‌చల్‌
పాఠశాల ఆవరణలో సంచరిస్తున్న నాగుపాము

  భయాందోళనలో విద్యార్థులు

కొమరాడ: విద్యార్థులను పాముల భయం వీడడం లేదు. ఇటీవల కురుపాం సంఘటన కళ్లెదుటే మెదలుతుంటే, తాజాగా కొమరాడ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాల/ కళాశాలలో మంగళవారం నాగుపాము హల్‌చల్‌ చేసింది. ఉదయం 10.30 గంటల సమయంలో వంట గది, భోజనశాల నుంచి బయటపడిన నాగుపామును చూసిన సిబ్బంది హడలిపోయా రు. వెంటనే కొమరా డ అటవీశాఖ సెక్షన్‌ అధికారి శ్రీనివాస రావుకు సమాచారం అందించారు. దీంతో ఆయన పాములు పట్టిన వ్యక్తిని తీసుకొచ్చి పామును బంధించి రిజర్వు ఫారెస్ట్‌లో విడిచిపెట్టారు. భోజనశాల నుంచి బయటకు గోదు మ నాగుపాము బయటపడటం తో విద్యార్థినులంతా భయాందోళన చెందారు. వారంతా అప్పుడే బ్రేక్‌ఫాస్ట్‌ చేసి తరగతి గదులకు వెళ్లిన తరువాత పాము బయటకు రావడాన్ని సిబ్బంది చూశారు. 

  

 

Updated Date - 2022-04-27T05:44:37+05:30 IST