Snake in Shiva temple: శివాలయంలో పూజలు చేస్తుండగా సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన పాము.. శివలింగంపైకి వెళ్లడంతో..

ABN , First Publish Date - 2022-08-05T01:31:28+05:30 IST

భారతదేశం ఆధ్యాత్మికతకు నిలయం. హిందువులు ఏ పండుగ వచ్చినా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుతారు. ముఖ్యంగా పరమశివుడికి సంబంధించి పర్వదినాలు అయితే.. అత్యంత భక్తి..

Snake in Shiva temple: శివాలయంలో పూజలు చేస్తుండగా సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన పాము.. శివలింగంపైకి వెళ్లడంతో..

భారతదేశం ఆధ్యాత్మికతకు నిలయం. హిందువులు ఏ పండుగ వచ్చినా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుతారు. ముఖ్యంగా పరమశివుడికి సంబంధించి పర్వదినాలు అయితే.. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. అలాగే నాగుల పంచమి (Naga Panchami) కూడా హిందువులకు అత్యంత ప్రాధాన్యమైన పండుగ (festival). ఆ రోజున హిందువులు శైవ క్షేత్రాలకు వెళ్లి పరమశివుడిని దర్శనం చేసుకుని పాలాభిషేకం చేస్తారు. పండుగ సందర్భంగా ఓ శివాలయంలో పూజలు చేస్తుండగా.. నాగు పాము దర్శనమిచ్చింది.. సరిగ్గా శివలింగం మీద చుట్టుకుని కూర్చుంది. శివలింగంపై పూజారి పాలు పోస్తుంటే.. నెమ్మదిగా ఆ పాలు తాగుతూ ఉంది. పూజారి సైతం ఆ పాముకు భయపడలేదు. అలాగే ఆ పాము కూడా ఎవరినీ భయపెట్టలేదు.


పూజారితో పాటు భక్తులు కూడా పాలను నెమ్మదిగా, నన్నటి ధారలా పోస్తూ... పాముకి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పరమశివుడి మెడలో ఆభరణంలా కనిపించిన ఆ పాము.. అందరినీ ఆశ్చర్యపరచింది. దీంతో అక్కడున్న భక్తులంతా ఓం నమఃశివాయ అంటూ ఆ ఆలయాన్ని శివనామ స్మరణలతో మారుమోగించారు. నాగ పంచమి రోజున మీకు భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓ నెటిజన్.. ఇన్‌స్టాలో ఈ వీడియోను షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ten years కష్టం ఫలించిందంటూ యువకుడి మెసేజ్.. మమ్మల్ని ఆశీర్వదించావ్.. అంటూ బదులిచ్చిన ఆనంద్ మహీంద్రా.. విషయం ఏంటంటే..



Updated Date - 2022-08-05T01:31:28+05:30 IST