భీమిలిపై మంచు దుప్పటి

ABN , First Publish Date - 2021-03-01T06:20:23+05:30 IST

భీమిలి పట్టణాన్ని ఆదివారం దట్టమైన పొగమంచు కమ్మేసింది.

భీమిలిపై మంచు దుప్పటి
బీచ్‌రోడ్‌లో పొగమంచులో వాకర్స్‌ నడక..

26 విశాఖ రోడ్‌ యోగాశ్రమం వద్ద పొగమంచు

భీమునిపట్నం, ఫిబ్రవరి 28: భీమిలి పట్టణాన్ని ఆదివారం దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం తొమ్మిది గంటల వరకు మంచుదుప్పటి కప్పుకున్నట్టు పట్టణం ఉండడంతో వాహనదారులు హెడ్‌ లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. ఇటు తగరపువలస నుంచి అటు బీచ్‌రోడ్డు మొత్తం పొగమంచు కమ్ముకొనడంతో ప్రజలు, వాహనదారులు దారి కనిపించక ఇబ్బందులకు గురయ్యారు. కాగా చాలామంది పొగమంచు మూలంగా భీమిలి ఊటీని తలపిస్తోందని ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ ఉల్లాసంగా..ఉత్సాహంగా గడిపారు. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భీమిలి విచ్చేసిన సందర్శకులు కూడా చల్లని వాతావరణాన్ని బాగా ఎంజాయ్‌ చేశారు.



Updated Date - 2021-03-01T06:20:23+05:30 IST