రాశి ఖన్నా చేతిలో ఇన్ని సినిమాలా..!

May 9 2021 @ 15:51PM

బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా చేతిలో ఏడు సినిమాలున్నాయని తెలుస్తోంది. ప్రతిరోజూ పండగే తర్వాత తెలుగులో కాస్త గ్యాప్ వచ్చినప్పటికి ఈ గ్యాప్‌ను తమిళ, మలయాళ సినిమాలతో భర్తీ చేస్తోంది. 'ఇమైకనొడిగళ్' సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమయిన ఈమె మొదటి సినిమాతోనే హిట్ అందుకొని వరసగా కొత్త ప్రాజెక్ట్స్ కమిటయింది. ప్రస్తుతం రాశి చేతిలో 'అరణ్మనై-3', 'మేధావి', 'తుగ్లక్ దర్బార్', 'సర్దార్', 'సైతాన్ క బచ్చా' సినిమాలతో  పాటు తెలుగులో అక్కినేని నాగ చైతన్యతో చేస్తున్న 'థాంక్యూ', గోపీచంద్‌తో 'పక్కా కమర్షియల్; సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇవన్నీ వచ్చే ఏడాదికి గాని పూర్తి కావని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే రాశి ఖన్నా డేట్స్ కావాలంటే మేకర్స్ ఓ ఏడాది వెయిట్ చేయాలేమో.  

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.