అన్నదాతలకు ఊరట

ABN , First Publish Date - 2022-06-30T05:37:58+05:30 IST

అన్నదాతలకు ఊరట లభించింది. ఎట్టకేలకు రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమ అవుతుండటంతో వ్యవసాయపనులు ఊపందుకోనున్నాయి.

అన్నదాతలకు ఊరట

- రైతు బంధు సాయం ఖాతాల్లో జమ

- కొత్త వారికి అవకాశం

- ఇప్పటికే 8,919 మంది రైతుల వివరాలు పోర్టల్‌లో నమోదు

- ఈనెలాఖరు వరకు దరఖాస్తుల స్వీకరణ

జగిత్యాల, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): అన్నదాతలకు ఊరట లభించింది. ఎట్టకేలకు రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమ అవుతుండటంతో వ్యవసాయపనులు ఊపందుకోనున్నాయి. అంతే కాకుండా రైతు బంధు పథ కం ఈ యేడాది వానాకాలంలో కొత్తగా నమోదైన రైతులకు సైతం వ ర్తింప జేసేందుకు అధికారులు నమోదు ప్రక్రియను ప్రారంభించారు. జి ల్లాలో రైతు బంధు డబ్బులు వారి వారి ఖాతాల్లో జమ చేయడం అధి కారులు షురూ చేశారు. దీంతో పంటల పెట్టుబడికి ఎదురుచూస్తున్న రైతులకు ఊరట లభించనుంది. ఈనెల 28వ తేదీ నుంచి రైతు బంధు సొమ్ము జమ చేయడానికి అవసరమైన నిధులు విడుదల చేశామని వ్య వసాయ శాఖ అధికారులు ప్రకటించారు.

జిల్లాలో 2,27,268 మంది రైతులకు ప్రయోజనం...

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 2022 వానాకాలానికి సంబంధించి 2,27,268 మంది రైతులకు రైతుబంధు పథకం కింద ప్రయోజనం కలగనుంది. సంబంధిత రైతులకు రూ. 212.26 కోట్లు రైతుబంధు పథకం కింద ఖాతాల్లో జమ కానుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు అధికా రులు పూర్తి చేశారు. గత యాసంగిలో 2,10,532 మంది రైతులకు 207.19 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ప్రస్తుత సీజన్‌లో రైతుల సంఖ్య పెంపుగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 2,27,268 మంది రైతులు ప్రయోజనం పొంద నుండగా ఇందులో బీర్‌పూర్‌ మండలంలో 8,135 మంది రైతులు, బు గ్గారంలో 7,185, ధర్మపురిలో 15,734, గొల్లపల్లిలో 16,056, ఇబ్రహీం ప ట్నంలో 10,313, జగిత్యాల 5,384, జగిత్యాల రూరల్‌ 16,611, కథలాపూ ర్‌లో 13,001 మంది రైతులున్నారు. కొడిమ్యాలలో 11,736, కోరుట్ల 13,169, మల్లాపూర్‌ 14,976, మేడిపల్లి 14,136, మెట్‌పల్లి 16,437, పెగడపల్లి 13, 573, రాయికల్‌ 14,740, సారంగపూర్‌ 7,340, వెల్గటూరు 17,601 మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు.

ముందుగా చిన్న కారు రైతులకు..

ప్రభుత్వం విడుదల చేసిన ఐతు బంధు డబ్బులు ముందుగా ఎకరం ఉన్న వారికి తర్వాత రెండు, మూడు ఎకరాల వారి, ఇలా రైతుల ఖాతా ల్లో జమ అవుతాయని జిల్లా వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. చిన్న, సన్న కారు రైతులే పెట్టుబడి కోసం ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దీంతో ముందు వారికి డబ్బులు వస్తే ఉత్సాహంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నం కానున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పట్టాదారుల్లో సుమారు లక్ష ఎకరాల మేరకు చిన్న, సన్న కారు రైతులే ఉండడం గమనార్హం.

కొత్తవారికి అవకాశం...

జిల్లాలో ఇప్పటివరకు రైతుబంధు పథకం కింద సాయం పొందుతున్న రైతులకు తోడుగా కొత్తవారికి సైతం ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ప్ర స్తుత సీజన్‌ నుంచి కొత్తవారికి సైతం సాయం అందించనున్నారు. 2022 జూన్‌ 22 వరకు కొత్తగా పాసుపుస్తకాలు పొంది అర్హత కలిగిన రైతుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 8,919 మంది రైతుల వివరాలు రైతు బంధు పోర్టల్‌లో చేర్చారు. కొత్తగా పాసుపు స్తకాలు పొందిన రైతులు సంబంధిత ఏఈవోల వద్ద రైతు బంధు కోసం జూలై 10వ తేదిలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచి స్తున్నారు. ఇందుకు దరఖాస్తు ఫారం, భూమి పాసు పుస్తకం జిరాక్స్‌, ఆధార్‌ కార్డు జిరాక్స్‌, బ్యాంకు పాసుపుస్తకం జిరాక్స్‌లను వెంట తీసుకొని వెళ్లాలని సూచిస్తున్నారు. గత యేడాది నుంచి కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం వచ్చిన వారి వివరాలను క్షేత్రస్థాయిలో ఏఈవోలు ట్యాబ్‌లలో న మోదు చేస్తున్నారు. క్లస్టర్ల వారిగా ఉన్న ఏఈవోలకు ప్రత్యేక లాగిన్‌ను ప్ర భుత్వం అందించింది. ఇటీవల భూముల క్రయ విక్రయాలు, యాజమా న్య హక్కుల బదిలీ, మార్పులు, చేర్పులు, వారసత్వ పట్టాల మార్పిడి చేసుకున్న రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు అందాయి. 

సవరణలకు అవకాశం...

ప్రభుత్వం రైతుబంధు పోర్టల్‌లో నమోదైన వివరాల్లో సవరణలు చేసు కునేందుకు అవకాశం కల్పించింది. గత యాసంగి సీజన్‌లో పెట్టుబడి సా యం కింద జమ అయిన నగదును కొందరు బ్యాంకర్లు పంట రుణాల కింద జమ చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితులు రాకుండా రుణ ఖాతాల స్థానంలో జమ ఖాతాల వివరాలు పోర్టల్‌లో చే ర్చేందుకు అవకాశం కల్పించింది. రైతులకు సంబందించిన ఫక్షన్‌ నంబ రు కూడా మార్చుకునే వీలును కల్పించింది. ప్రభుత్వం కల్పించిన అ వకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పల్లెల్లో రైతులకు వ్యవసాయ అ ధికారులు అవగాహన కల్పిస్తున్నారు. కాగా భూ విస్తీర్ణంలో ఎలాంటి మా ర్పులు జరగకపోయినప్పటికీ రైతుల సంఖ్య ప్రతీ సీజన్‌లో పెరుగు తోం ది. వారసత్వంగా ఉన్న భూమి అన్నదమ్ములు పంచుకోవడం, ఉన్న భూ మిని ఆర్థిక అవసరాలకు అమ్ముకోవడం తదితర కారణాల వల్ల రైతుల సంఖ్య పెరుగుతోంది. సంబంధిత రైతులంతా కస్లర్ల వారీగా ఏఈవోల వద్ద వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 

అన్నదాతల హర్షం...

ప్రభుత్వం ప్రతీయేటా రైతుబంధు డబ్బులను సీజన్‌కు ముందుగా రైతు ఖాతాల్లో వేస్తుండడం జరిగేది. ప్రస్తుత సీజన్‌ ప్రారంభమైనా రై తుల ఖాతాల్లో డబ్బులు పడలేదు. దీంతో పెట్టుబడి కోసం రైతులు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లడం, షాపుల్లో ఉద్దెరలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. మరికొందరు రైతులు చేతిలో డబ్బులు లేక ఇప్ప టికీ పనులు ప్రారంభించలేదు. ఈ పరిస్థితుల్లో రైతు బంధ పథకం కింద డబ్బులు విడుదల కావడంతో జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రైతు పక్షపాతి సీఎం కేసీఆర్‌

చీటి వెంకట్రావు, జిల్లా రైతు సమన్వయ సమితి నాయకులు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు పక్షపాతిగా అవసరమైన పనులు చేస్తున్నా రు. గతంలో ఎన్నడూలేని విధంగా టీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో రైతు ల సంక్షేమానికి అవసరమైన అనేక కార్యక్రమాలను సీఎం కేసీఆర్‌ నేతృ త్వంలో నిర్వహిస్తున్నారు. రైతుల కష్టాలను గట్టెక్కించడానికి సీఎం కేసీ ఆర్‌ చేస్తున్న కృషి సంతోషకరం. రైతుబంధు సాయం యేటా రెండు సీజ న్‌లలో అందిస్తుండడం వల్ల రైతులకు ఆర్థిక ప్రయోజనాలు అందుతున్నాయి.

సద్వినియోగం చేసుకోవాలి

సురేశ్‌ కుమార్‌, జిల్లా వ్యవసాయ అధికారి, 

ప్రభుత్వం పంటల పెట్టుబడి కోసం విడుదల చేసిన రైతుబంధు డ బ్బులు సద్వినియోగం చేసుకోవాలి. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చే యడం ప్రారంభించాము. చిన్న, సన్న కారు రైతుల మొదలుకొని దశల వారిగా అందరికి డబ్బులు అందనున్నాయి. ప్రస్తుతం సాగుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకోవాలి. ప్రతీ కొనుగోలుకు షాపు నుంచి రశీదు తీసుకోవాలి. అర్హులైన రైతులందరికి పెట్టుబడి సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నాము.

Updated Date - 2022-06-30T05:37:58+05:30 IST