మహిళలదే ఉన్నత స్థానం

ABN , First Publish Date - 2021-03-07T05:17:11+05:30 IST

సమాజంలో పురుషుల కంటే మహిళలదే ఉన్నత స్థానమని విశాఖపట్నం రేంజ్‌ డీఐజీ రంగారావు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిర్‌లో ‘మహిళా భద్రత’ అనే అంశంపై శనివారం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఐజీ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. మహిళలు పురుషులతో సమానంగా ఉండడం కాదని, అంతకంటే ఉన్నతస్థానంలో ఉండాలని పిలుపునిచ్చారు.

మహిళలదే ఉన్నత స్థానం
మాట్లాడుతున్న డీఐజీ రంగారావు

  వారితోనే సమాజ అభివృద్ధి సాధ్యం
  ‘మహిళా భద్రత’ సదస్సులో డీఐజీ రంగారావు
శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, మార్చి 6:
సమాజంలో పురుషుల కంటే మహిళలదే ఉన్నత స్థానమని విశాఖపట్నం రేంజ్‌ డీఐజీ రంగారావు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిర్‌లో ‘మహిళా భద్రత’ అనే అంశంపై శనివారం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఐజీ ముఖ్యఅతిథిగా  మాట్లాడారు. మహిళలు పురుషులతో సమానంగా ఉండడం కాదని, అంతకంటే ఉన్నతస్థానంలో ఉండాలని పిలుపునిచ్చారు. నవ సమాజ అభివృద్ధి వారి చేతుల్లోనే ఉందన్నారు. మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే దిశ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బాలికలను వేధింపులకు గురిచేస్తే  పోక్సో చట్టం కింద కేసులు పెడతామన్నారు. మహిళలు  ఎవరికన్నా తక్కుకాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని డీఐజీ తెలిపారు.

పిల్లలకు విలువలు నేర్పాలి: కలెక్టర్‌ నివాస్‌


పిల్లలకు విలువలతో కూడిన విద్యను నేర్పించడంతోనే స మాజంలో మార్పు వస్తుందని కలెక్టర్‌ నివాస్‌ స్పష్టం చేశారు. పిల్లలను తల్లిదండ్రులు కొట్టకూడదని తెలిపారు. మహిళలకు స్వీయ ఆలోచన ఉండాలన్నారు. మహిళల భద్రతకు కొందరు స్త్రీలే భంగం కలిగిస్తున్న సంఘటనలు సమాజంలో జరుగుతుండడం బాధాకరమన్నారు. వరకట్న వేధింపుల కేసుల కింద భర్తతోపాటు ఆమె అత్త, ఆడపడుచులపై కూడా కేసులు నమోదవుతుండడమే దీనికి ఉదాహరణ అన్నారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ, మహిళా రక్షణకు పలు చట్టాలు ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలని  సూచించారు. దిశ యాప్‌ను మహిళలందరూ డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ అమిత్‌బర్దర్‌, బీఆర్‌ఏయూ   సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సుజాత, ఏఎస్పీ సోమశేఖర్‌, విఠలేశ్వర్‌, డీఎస్పీలు శ్రావణి, మహేంద్ర, సీఐలు, విద్యార్థినులు, మహిళా పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T05:17:11+05:30 IST