తీర్పులలోనూ సామాజిక న్యాయం

ABN , First Publish Date - 2021-10-23T06:15:42+05:30 IST

భారత రాజ్యంగం ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే, చట్టం నుండి ప్రజలందరికీ సమాన రక్షణ లభిస్తుంది. దీనినే రూల్‌ ఆఫ్‌ లా అంటారు. వాస్తవంలో ఎన్నో సాంఘిక, ఆర్ధిక, రాజకీయ, భౌగోళిక, కుల, మతపరమైన.....

తీర్పులలోనూ సామాజిక న్యాయం

భారత రాజ్యంగం ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే, చట్టం నుండి ప్రజలందరికీ సమాన రక్షణ లభిస్తుంది. దీనినే రూల్‌ ఆఫ్‌ లా అంటారు. వాస్తవంలో ఎన్నో సాంఘిక, ఆర్ధిక, రాజకీయ, భౌగోళిక, కుల, మతపరమైన అసమానతలున్న ఈ దేశంలో చట్టానికి ప్రతి రూపమైన న్యాయం ముందు మాత్రం అందరూ సమానం కాదు. న్యాయ వ్యవస్థలో భాగం అయిన పోలీస్‌, న్యాయస్ధానాలు మనకున్న అసమానతలవలే అప్రకటిత విభజనకు గురి అయి ‘‘ఒక మనిషికి ఒక విలువ’’ అనే సూత్రాన్ని నిరాకరిస్తూనే ఉన్నాయి. వ్యవస్థలను, వ్యక్తులను వాటి ఆధిపత్యాన్ని అదిమిపట్టి అదుపు ఆజ్ఞలలో పెట్టవలసిన పోలీస్‌, న్యాయస్ధానాలు చాలా సందర్భాలలో ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తూనే ఉన్నాయి. నేరం చేస్తే ఎంతటి వారినైనా శిక్షించాలి. కాని దిక్కూ మొక్కు లేని వారికి, సమాజంలో క్రింది వర్గాల వారికి ఒక న్యాయం, పై వర్గాల వారికి ఒక న్యాయం అనే విధానం పోలీస్‌ వ్యవస్ధలోను, కోర్టు తీర్పులలోను కనిపిస్తుంది. కావున అన్ని వ్యవస్ధలను నిర్దేశించే చట్టం ప్రతిరూపమైన న్యాయం చెప్పే కోర్టులు తమ తీర్పులలో కూడా సామాజిక న్యాయ సూత్రాన్ని పాటించవలసిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రభుత్వాలు చట్టాలు చెయ్యాలి.


– పిల్లి ప్రసన్నకుమార్‌

Updated Date - 2021-10-23T06:15:42+05:30 IST