నాటు బాంబు విసిరినట్టు... కొబ్బరికాయ పగులగొట్టిన శశిధరూర్!

ABN , First Publish Date - 2021-08-26T14:06:28+05:30 IST

కేరళకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్...

నాటు బాంబు విసిరినట్టు... కొబ్బరికాయ పగులగొట్టిన శశిధరూర్!

తిరువనంతపురం: కేరళకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. శశిథరూర్ కేరళలోని ఒక దేవాలయంలో కొబ్బరికాయ పగలగొట్టే దృశ్యం దీనిలో కనిపిస్తుంది. 


ఫోటో ను గమనిస్తే... శశిధరూర్ తన శక్తినంతా కూడదీసుకుని, బలంగా లాగిపెట్టి కొబ్బరికాయను దూరంగా విసిరికొట్టినట్లు కనిపిస్తుంది. ఈ ఫోటో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.


శశిథరూర్ కి సంబంధించిన ఈ ఫొటో నెట్‌లో ప్రత్యక్షం కాగానే... యూజర్లు వ్యంగ్య కామెంట్లు చేయడంతో పాటు మీమ్స్ కురిపిస్తున్నారు. 


కొందరు యూజర్లు... మీమ్స్ రూపంలో శశిధరూర్‌ను టోక్యో ఒలింపిక్స్‌కు తీసుకెళ్లగా, మరికొందరు లీడ్స్ టెస్ట్ మ్యాచ్ గ్రౌండ్‌కు తీసుకువెళ్లారు. మరికొందరు ఇదేదో నాటు బాంబా విసిరినట్లున్నదంటూ కామెంట్ చేశారు. వీటిని చూసిన శశిథరూర్ తెగ ఆశ్చర్యపోయారు.

Updated Date - 2021-08-26T14:06:28+05:30 IST