యువకుడిని కాపాడిన సోషల్ మీడియా

ABN , First Publish Date - 2021-03-27T22:21:38+05:30 IST

ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్న యువకుడిని సోషల్ మీడియా సహాయంతో

యువకుడిని కాపాడిన సోషల్ మీడియా

అనంతపురం: ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్న యువకుడిని సోషల్ మీడియా సహాయంతో పోలీసులు కాపాడారు. అనంతపురంలో ఓ యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు."క్షమించండి అన్నా, నేను చనిపోతున్నా" అంటూ  స్నేహితులకు వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా సందేశం పంపాడు. ఈ సందేశాన్ని జగ్గయ్యపేటకు చెందిన మిత్రులు చూసారు. వెంటనే వారు అప్రమత్తమై యువకుడిని కాపాడాలని నిర్ణయించుకున్నారు. జగ్గయ్యపేట అన్నపూర్ణ సేవా సమితి అధ్యక్షుడు మహంకాళి జయప్రకాష్ 122కు ఫోన్ చేసి ఆ యువకుడి ఆత్మహత్యాయత్నం‌పై ఫిర్యాదు చేసి, వాట్సాప్, ఫేస్‌బుక్ సందేశాన్ని పోలీసులకు పంపాడు.




 తమకు అందిన ఫిర్యాదుపై అనంతపురం త్రీటౌన్ పోలీసులు వెంటనే స్పందించారు. ఫేస్‌బుక్‌లో పెట్టిన పట్టాలపై పడుకున్న ఫొటోలను ఆధారంగా చేసుకుని అతడు ఉన్న ప్రదేశాన్ని పోలీసులు గుర్తించారు. తాటిచర్ల రైల్వే ట్రాక్ పట్టాల మీద పడుకున్న యువకుడిని రక్షించి పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ యువకుడు అనంతపురం స్టేషన్లో ఉన్నాడు. సినీఫక్కీలో బలవన్మరణానికి పాల్పడుతున్న యువకుడిని కాపాడిన జగ్గయ్యపేట అన్నపూర్ణ సేవా సమితి సభ్యులకు, పోలీసులకు స్థానికుల నుంచి ప్రశంసలు, అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2021-03-27T22:21:38+05:30 IST