దర్జాగా ప్రభుత్వ భూముల ఆక్రమణ

ABN , First Publish Date - 2022-06-26T05:05:10+05:30 IST

మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ దర్జాగా సాగుతోంది. తాజాగా దర్శి - పొదిలి ఆర్‌అండ్‌బీ మార్జిన్‌ భూమిని ఆక్ర మించి కొంతమంది మట్టి తోలుతున్నారు.

దర్జాగా ప్రభుత్వ భూముల ఆక్రమణ
ప్రభుత్వ భూమిలోకి తోలిన మట్టి

దర్శి, జూన్‌ 25 : మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ దర్జాగా సాగుతోంది. తాజాగా దర్శి - పొదిలి ఆర్‌అండ్‌బీ మార్జిన్‌ భూమిని ఆక్ర మించి కొంతమంది మట్టి తోలుతున్నారు. ఆర్‌అండ్‌బీ రోడ్డు మార్జిన్‌ ఆనుకొని 30 సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది. ఈ రోడ్డు మార్జిన్‌ భూమి, ఏడబ్ల్యూ భూమి కలిపి మొత్తం 50 సెంట్లు ఉంది. లక్షలాది రూపాయల విలువ చేసే ఈ భూమిలో మట్టితోలి విక్రయించేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రదాన రహదారిలో యథేచ్ఛగా ప్రభుత్వ భూమిలో మట్టిని తోలుతున్నా అధికారులు పట్టించుకోకపోవటంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

తహసీల్దార్‌ వివరణ

ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఏవీ రవిశంకర్‌ను వివరణ ఇస్తూ..  33 సెంట్ల ప్రభుత్వ భూమి ఉందని తెలిపారు. ఆక్రమించిన వారికి నోటీసు ఇచ్చి తగు చర్యలు తీసుకుంటామన్నారు. మట్టిని తొలగించి స్థల సంరక్షణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.  

Updated Date - 2022-06-26T05:05:10+05:30 IST