‘సోలార్‌ వెలుగు’లేవీ!

ABN , First Publish Date - 2022-06-27T07:02:11+05:30 IST

భయ గోదావరి జిల్లాలను కలుపుతూ వశిష్ఠ గోదావరిపై దిండి-చించినాడ వంతెనపై నిత్యం వేలాది మంది ప్రజలు రాకపోకలు జరుపుతారు. ఇక్కడ సోలార్‌ లైట్లు ఆరిపోయి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

‘సోలార్‌ వెలుగు’లేవీ!
వంతెనపై వెలగని సోలార్‌ లైట్లు

  • దిండి-చించినాడ వంతెనపై ఏళ్ల తరబడి వెలగని సోలార్‌ లైట్లు
  • తప్పించుకుంటున్న ఆర్‌అండ్‌బీ, హైవే అధికారులు

మలికిపురం, జూన 26: ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ వశిష్ఠ గోదావరిపై దిండి-చించినాడ వంతెనపై నిత్యం వేలాది మంది ప్రజలు రాకపోకలు జరుపుతారు. ఇక్కడ సోలార్‌ లైట్లు ఆరిపోయి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఈ వంతెను ఆర్‌అండ్‌బీ శాఖ నిర్మించినప్పటికీ నేషనల్‌ హైవే లెక్కలో చేరిపోవడంతో మాది కాదంటే మాది కాదని అధికారులు చేతులు దులుపుకుంటున్నారు తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవట్లేదు. ఈ మార్గలోఓ రేయింబవళ్లూ ప్రయాణాలు సాగుతూనే ఉంటాయి. గతంలో అమలాపురం ఎంపీగా పనిచేసిన జీవీ హర్షకుమార్‌ తన ఎంపీ నిధు లతో వంతెనకు ఇరువైపులా సోలార్‌ లైట్లను ఏర్పాటు చేయించారు. పర్యవేక్షణ కరువ డడంతో కొందరు దొంగలు సోలార్‌ లైట్ల బ్యాటరీలను దొంగిలించారు. పోలీసులు కొందరిని అరెస్టు కూడా చేశారు. అప్పట్నుంచీ సోలార్‌ లైట్లు వెలగట్లేదు. ప్రజాప్రతినిధులు మారు తున్నారు తప్ప లైట్ల గురించి ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపానపోలేదు. ఇక ఈ వంతెనను కొందరు తాగుబోతులు తమ అడ్డాగా మార్చుకున్నారు. ఏడాది క్రితం భీమవరం పెళ్లికి వెళ్లి తిరిగివస్తున్న రెండు జంటలపై తాగుబోతులు అఘాయిత్య చేయబోయారు. ఆ జంటలు మోటారు సైకిళ్లపై దిండి నుంచి వెళ్లిపోగా తాగుబోతులు మేడిచర్లపాలెం వరకు వెంబడించి అల్లరి చేయబోయారు. అప్పటి ఎస్‌ఐ ఎం.నాగరాజుకు ఫోనలో విషయం తెలపగా వారిని వారి ఇళ్లకు చేర్చారు. ఇటువంటి సంఘటనలు అనేకం జరుగుతున్న ప్పటికీ ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా వంతెనపై లైట్ల కోసం ఆర్‌అండ్‌బీ అధికారులను అడగ్గా వంతెన నేషనల్‌ హైవే పరిధిలోనిదని చెప్పి తప్పించుకున్నారు. 



Updated Date - 2022-06-27T07:02:11+05:30 IST