Heroic death: కశ్మీర్‏లో తీవ్రవాదుల దాడి

ABN , First Publish Date - 2022-08-12T15:26:46+05:30 IST

కశ్మీర్‌లో సైనిక శిబిరంపై తీవ్రవాదులు జరిపిన దాడిలో రాష్ట్రానికి చెందిన సైనికుడు(soldier) వీరమరణం పొందారు. తీవ్రవాదుల దాడిలో ముగ్గురు

Heroic death: కశ్మీర్‏లో తీవ్రవాదుల దాడి

                         - పుదుపట్టికి చెందిన సైనికుడి వీరమరణం


పెరంబూర్‌(చెన్నై), ఆగస్టు 11: కశ్మీర్‌లో సైనిక శిబిరంపై తీవ్రవాదులు జరిపిన దాడిలో రాష్ట్రానికి చెందిన సైనికుడు(soldier) వీరమరణం పొందారు. తీవ్రవాదుల దాడిలో ముగ్గురు జవాన్లు బలవ్వగా వారిలో ఒకరు రాష్ట్రవాసి అని రక్షణ శాఖ ప్రకటించింది. కశ్మీర్‌ రాజోరి(Kashmir Rajori) ప్రాంతం నుంచి 25 కి.మీ దూరంలో ఉన్న సైనిక శిబిరంపై గురువారం వేకువజామున 3.30 గంటల ప్రాంతంలో ఇద్దరు తీవ్రవాదులు చొరబడి కాల్పులు జరిపిన ఘటనలో ముగ్గురు సైనికులు మృతిచెందారు. అదే సమయంలో సైనికుల ఎదురు కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. వీరమరణం పొందిన సైనికుల్లో ఒకరు మదురై జిల్లా పుదుపట్టికి చెందిన లక్ష్మణన్‌ (25) ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ధర్మరాజ్‌-ఆండాళ్‌ కుమారుడైన లక్ష్మణన్‌ 2019లో ఆర్మీలో చేరారు. మృతుడికి భార్య, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. లక్ష్మణన్‌ మృతదేహం శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానంలో మదురైకి తరలించి, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు  నిర్వహించనున్నారు.


అమరవీరుడి కుటుంబానికి రూ.20 లక్షలు : సీఎం

తీవ్రవాదుల దాడిలో రాష్ట్రానికి చెందిన సైనికుడు మృతిచెందడంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సచివాలయం విడుదల చేసిన ప్రకటనలో, మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపడంతో పాటు రూ.20 లక్షల ఆర్ధికసాయం అందజేయనున్నట్లు సీఎం ప్రకటించారు.కాగా గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి సైతం లక్ష్మణన్‌ మృతి పట్ల తీవ్ర సంతాపం ప్రకటించారు. 

Updated Date - 2022-08-12T15:26:46+05:30 IST