రక్తదానం చేసి మహిళ ప్రాణాలు కాపాడిన సైనికుడు

ABN , First Publish Date - 2021-06-18T03:19:34+05:30 IST

సరిహద్దుల్లో శత్రుమూకలతో పోరాడడమే కాదు.. దేశ ప్రజల పట్ల మానవత్వాన్ని ప్రదర్శించడంలోనూ సైనికులు ముందే ఉంటారని..

రక్తదానం చేసి మహిళ ప్రాణాలు కాపాడిన సైనికుడు

జమ్మూ: సరిహద్దుల్లో శత్రుమూకలతో పోరాడడమే కాదు.. దేశ ప్రజల పట్ల మానవత్వాన్ని ప్రదర్శించడంలోనూ సైనికులు ముందే ఉంటారని మరోసారి రుజువైంది. జమ్మూ కశ్మీర్‌లో మృత్యువుతో పోరాడుతున్న మహిళకు ఓ సైనికుడు రక్తదానం చేసి ప్రాణాలు కాపాడినట్టు అధికారులు వెల్లడించారు. పూంచ్‌లోని జిల్లా ఆస్పత్రిలో తీవ్ర అస్వస్థతకు గురైన ఓ మహిళకు ఏబీ నెగిటివ్ గ్రూప్ రక్తం కావాలంటూ తమకు అత్యవసర సందేశం అందిందని సైనిక ప్రతినిధి నసీబ్‌జాన్ వెల్లడించారు. ఈ విషయం తెలియగానే లోవర్ కృష్ణ ఘాటిలోని రాష్ట్రీయ రైఫిల్‌కి చెందిన ఓ జవాను స్వచ్ఛందంగా సాయం చేసేందుకు ముందుకొచ్చారని ఆయన తెలిపారు. ‘‘ఒక మహిళ ప్రాణాలు కాపాడేలా జవాను స్పందించిన తీరుతో.. ఆర్మీకి, ‘ఆవామ్’ (ప్రజలు) మధ్య మరింత అనుబంధం పెరిగింది..’’ అని నసీబ్ కొనియాడారు.

Updated Date - 2021-06-18T03:19:34+05:30 IST