పంజాబ్‌ పఠాన్‌కోట్‌లో సైనికుడు మృతి

ABN , First Publish Date - 2021-03-06T06:10:19+05:30 IST

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్లకు చెందిన సైనికుడు పగిళ్ల వెంకన్న(38) మృతితో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పంజాబ్‌ రాష్ట్రంలోని పఠాన్‌కోట్‌ ఇండియన్‌ ఆర్మీ రెజిమెంట్‌లో జవాన్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకన్న గురువారం మృతిచెందినట్లు ఆర్మీ అధికారులు శుక్రవారం కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

పంజాబ్‌ పఠాన్‌కోట్‌లో సైనికుడు మృతి
కన్నీరుమున్నీరుగా రోదిస్తున్న తల్లి లక్ష్మమ్మ

తడకమళ్లలో విషాదఛాయలు

మిర్యాలగూడ రూరల్‌, మార్చి 5: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్లకు చెందిన సైనికుడు పగిళ్ల వెంకన్న(38) మృతితో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పంజాబ్‌ రాష్ట్రంలోని పఠాన్‌కోట్‌ ఇండియన్‌ ఆర్మీ రెజిమెంట్‌లో జవాన్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకన్న గురువారం మృతిచెందినట్లు ఆర్మీ అధికారులు శుక్రవారం కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో మృతుడి సోదరుడు సైదులు హుటాహుటిన పంజాబ్‌ రాష్ట్రంలోని పఠాన్‌కోట్‌ వెళ్లాడు. తల్లి లక్ష్మమ్మ అనారోగ్యంతో ఉండడంతో కుమారుడు మృతిచెందిన విషయా న్ని శుక్రవారం ఉదయం వరకు బంధువులు తెలియనివ్వలేదు. ప్రసార మాధ్యమాల ద్వారా సమాచారం తెలుసుకున్న తల్లి లక్ష్మమ్మ కన్నీరుమున్నీరుగా రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. వెంకన్న మృతి విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు తడకమళ్లకు తరలిరావడంతో గ్రామంలో విషాఽధఛాయలు అలుముకున్నాయి. శనివారం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువస్తున్నామని కుటుంబసభ్యులు తెలిపారు.


 కుమారుడి కళ్లెదుటే తండ్రి మృతి 

అల్లుడి బైకుపై వస్తుండగా ఘటన

నార్కట్‌పల్లి, మార్చి 5: కుమారుడి కళ్లెదుటే తండ్రి మృతి చెందాడు. నార్కట్‌పల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. వలిగొండ మండలం వేములకొండకు చెందిన గనెబోయిన మారయ్య(56), కుమారుడు నవీన్‌ ఒక బైకుపై, చౌటుప్పల్‌కు చెందిన  మారయ్య అల్లుడు లింగస్వామి,  వియ్యంకుడు మరో బైకుపై శుక్రవారం మధ్యాహ్నం బంధువుల ఇంటికి శాలిగౌరారం మండలం   తక్కెళ్లపాడు  గ్రామానికి వెళ్లారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో మారయ్య, అల్లుడు లింగస్వామి బైకు ఎక్కాడు. కుమారుడు నవీన్‌ బైకును వియ్యంకుడు ఎక్కా డు.  మండలంలోని అమ్మనబోలు రోడ్డు నుంచి నార్కట్‌ పల్లి వైపునకు వస్తుండగా సాయంత్రం 5.30 గంటల సమయంలో ముందు వెళుతున్న బైకును నల్లగొండ వైపు మళ్లుతున్న టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకు వెనుక ఉన్న మారయ్య తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందగా, అల్లుడు లింగస్వామికి స్వల్ప గాయాలయ్యాయి. వెనుక బైకును నడుపుతున్న కుమారుడు 108 అంబులెన్సు సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందిం చాడు.  లింగస్వామిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌ ఈఎంటీ శంకరమ్మ, పైలట్‌ సేతుపాల్‌ స్థానిక కామినేని ఆసుపత్రికి తరలించారు. కుమారుడి కళ్లెదుటే తండ్రి మృతి చెందడం విషాదాన్ని నింపింది. మారయ్యకు భార్య, కుమా ర్తె, కుమారుడు ఉన్నారు. టిప్పర్‌ను వదిలి డ్రైవర్‌ పరారయ్యాడు. కుమారుడు నవీన్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బాద్యానాయక్‌ తెలిపారు.


చెట్టుపై నుంచి పడి రైతు..

నార్కట్‌పల్లి, మార్చి 5: ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి రైతు మృతి చెందాడు. మండలంలోని నెమ్మానిలో  గ్రామానికి చెందిన రైతు వంగాల యాదిరెడ్డి(54)  మేలకుంటకు వెళ్లే  దారిలో ఉన్న తన సమీప బంధువుకు చెం దిన చింతచెట్టు ఎక్కి కాయలు కోస్తూ ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి అక్కడిక క్కడే మృతి చెందాడు. యాదిరెడ్డికి  భార్య శంకరమ్మ, కుమార్తె, కుమారుడు ఉన్నారు.  


సారా బట్టీలపై దాడులు

దేవరకొండ(మర్రిగూడ), మార్చి 5: మండలంలోని అంతంపేట గ్రామపరిధిలోని హజనతండా శివారులో శుక్ర వారం సారాబట్టీలపై నాంపల్లి ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో  500 లీటర్ల బెల్లం పానకాన్ని  స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్లు నాంపల్లి ఎక్సైజ్‌ సీఐ మాధవయ్య తెలిపారు. సారాను సారా విక్రయిస్తున్న వికతమడపల్లి గ్రామానికి చెందిన మొగలి యాదయ్యను పట్టుకుని తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేయగా రూ.25 వేల జరిమానా విధించినట్లు  తెలిపారు కార్యక్రమంలో పలువురు ఎక్సైజ్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత 

నేరేడుగొమ్ము, మార్చి 5: నేరేడుగొమ్ము శివారు నుంచి  దేవరకొండకు అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాళ్ల పీడీ ఎస్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండకు చెందిన రాజ్‌కు మార్‌ కొత్తపల్లి గ్రామపరిధిలోని మేగావత్‌తండాలో  దఫాల వారీగా 25 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు  చేశారు. ఈ బియ్యాన్ని  ఓ వాహనంలో తరలిస్తుండగా పట్టుకుని  కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 


యువకుడి ఆత్మహత్య 

మిర్యాలగూడ, మార్చి 5: పట్టణంలోని హౌజింగ్‌ బోర్డు కాలనీకి చెందిన షేక్‌ ఆరీఫ్‌(23) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్‌ సీఐ సదానాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. అరీఫ్‌ పట్టణంలో ఫాస్ట్‌పుడ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. ఇంట్లో ఉరేసుకున్నాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 


ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి 

తిప్పర్తి, మార్చి 5: ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు.  పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వెంకటాద్రి పాలెం గ్రామానికి చెందిన పల్లె చిన్న నాగయ్య(40) గురువారం రాత్రి  ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదు. దీంతో ఆందోళన చెందిన భార్య, కుటుంబ సభ్యులు గ్రామంలో వెతికినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం గ్రామ శివారులో నాగయ్య మృతదేహాన్ని స్థానికులు గుర్తించి కుటుంబసభ్యులకు సమా చారం అందించారు. బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెంది ఉండవచ్చని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. నాగయ్యకు ఇద్దరు కుమారు లు ఉన్నారు. మృతుడి భార్య  వీరమ్మ  ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


గ్రామాలకు డీజిల్‌ సరఫరా చేయాలి

నల్లగొండ, మార్చి 5: మండల పరిధిలోని తమ గ్రామాలకు ట్యాంకర్‌ ద్వారా డీజిల్‌ సరఫరా చేయనివ్వాలని, ఎలాంటి అడ్డంకులూ కల్పించవద్దని నాంపల్లి మండలానికి చెందిన పలువురు సర్పంచ్‌లు, పలువురు రైతులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం పలువురు సర్పంచ్‌లు డీఎ్‌సఓ రుక్మిణికి వినతి పత్రం అందజేశారు. రైతుల అవసరాలు, ట్రాక్టర్లల వినియోగానికి డీజిల్‌ అవసరం పడుతోందని, మండల కేంద్రంలోని బంక్‌కు వెళ్లడానికి దూరం ఎక్కువగా ఉన్నందున తమ గ్రామాలకే డీజిల్‌ ట్యాంకర్‌ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మల్లపురాజుపల్లి సర్పంచ్‌ రేవల్లి సుధాకర్‌, పసునూరు సర్పంచ్‌ పోగుల దివ్య, మహ్మాదాపురం సర్పంచ్‌ మల్గిరెడ్డి చంద్రారెడ్డి, తుంగపహాడ్‌ సర్పంచ్‌ దండిగ అలివేలు, స్వాములవారి లింగోటం సర్పంచ్‌ అంగిరేకుల పాండు, రైతులు ఉన్నారు. 

Updated Date - 2021-03-06T06:10:19+05:30 IST