ఘనజీవామృతం ఘనమైన ఎరువు

ABN , First Publish Date - 2021-03-01T04:50:09+05:30 IST

మండలంలోని మడితాడు క్లస్టర్‌ చిన్నగొల్లపల్లె వీవోలోని పాతజంగంపల్లెలో దివ్యతేజ, నాగమణి, సుహాణిని ఎస్‌హెచ్‌జీ సభ్యులతో సామూహికంగా ఘనజీవామృతం తయారు చేయడం జరిగింది.

ఘనజీవామృతం ఘనమైన ఎరువు
ఘనజీవామృతాన్ని తయారు చేస్తున్న దృశ్యం

సుండుపల్లె, ఫిబ్రవరి28: మండలంలోని మడితాడు క్లస్టర్‌ చిన్నగొల్లపల్లె వీవోలోని పాతజంగంపల్లెలో దివ్యతేజ, నాగమణి, సుహాణిని ఎస్‌హెచ్‌జీ సభ్యులతో సామూహికంగా ఘనజీవామృతం తయారు చేయడం జరిగింది. ఇందులో పార్వతి రెడ్స్‌ ఫింగో సీఏ మాట్లాడుతూ అన్ని రకాల పంటలకు ఘనజీవామృతం చాలా ముఖ్యమైందని, దీని ద్వారా వానపాములు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. అనంతరం వెంకటయ్య, ఐసీఆర్‌పీలు మాట్లాడుతూ 100 కేజీల నాటుఆవు పేడ, తగినంత మూత్రం, 2 కేజీల ఉలవపిండి, గుప్పెడు పుట్టమట్టిలతో ఘనజీవామృతం తయారు చేసుకొని వారం రోజులు నీడలో ఆరబెట్టి, ఏ పంటకు అయినా దుక్కిలో వేయడం ద్వారా భూమి లోపల ఉన్న వానపాములు అభివృద్ధి చెందిన భూమిని గుళ్ల బారించడంతో సారవంత అవుతుందన్నారు. ఒక్క గ్రాము ఆవుపేడలో 2 నుంచి 3 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయని వివరించారు. లీడఫార్మర్స్‌, సంతో్‌షకుమారి,అమరావతి, నాగార్జున, బాలాజీ, ఎస్‌హెచ్‌జీ మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T04:50:09+05:30 IST