చాకలి ఐలమ్మకు ఘననివాళి

Sep 26 2021 @ 23:59PM
మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టరేట్‌లో ఐలమ్మ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ హరీష్‌, అధికారులు

(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరవనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలని మేడ్చల్‌ ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీష్‌ అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో చాకలి ఐలమ్మ 126వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్‌వో లింగ్యానాయక్‌, ఏవో వెంకటేశ్వర్లు, జిల్లా బీసీ సంక్షేమాధికారి ఝాన్సీరాణి పాల్గొన్నారు.

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ

వికారాబాద్‌: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ అని వికారాబాద్‌ అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులతో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి, భుక్తి కోసం దొరలను గడగడలాడించిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యులు శుభప్రద్‌ పటేల్‌, టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌, మునిసిపల్‌ చైర్మన్‌ మంజుల రమేష్‌, బీసీ సంక్షేమ శాఖ అధికారి పుష్పలత, టీటీడీవో కోటాజీ, రజక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Follow Us on: