పోలీసు అమరులకు ఘన నివాళులు

ABN , First Publish Date - 2020-10-22T06:45:58+05:30 IST

పరిపాలన సజావుగా సాగాలంటే శాంతిభద్రతలు చాలా ముఖ్యమని శాంతిభద్రతలు బాగున్నప్పుడే అభివృద్ధి ఉంటుందని నిజామా బాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు

పోలీసు అమరులకు ఘన నివాళులు

 కలెక్టర్‌ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ


నిజామాబాద్‌ అర్బన్‌, అక్టోబరు 21: పరిపాలన సజావుగా సాగాలంటే శాంతిభద్రతలు చాలా ముఖ్యమని శాంతిభద్రతలు బాగున్నప్పుడే  అభివృద్ధి ఉంటుందని నిజామా బాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరే డ్‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు.


ఈ సందర్భంగా కలెక్టర్‌ నారాయణరెడ్డి మాట్లాడుతూ పరిపాలనలో భాగంగా అన్ని ప్రభుత్వాలు మంచి సేవ అందించే ఉద్దేశ్యంతో అనేక సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లేందు కు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ముందుకు సాగుతుంటుందని పరిపాలన సజావుగా సాగాలంటే పోలీసు శాఖ అనేది గుండెకాయ వంటిదని అన్నారు. శాంతిభద్రతల కోసం ఎంతో మంది పోలీసు సిబ్బంది తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేశారని వారి ప్రాణ త్యాగం వల్ల ప్రభుత్వాలు పరిపాలన సజావుగా కొనసాగిస్తున్నాయని వారి జ్ఞాపకార్థమే నేడు అమరవీరుల సంస్మరణ దినంగా  నిర్వహిస్తున్నామని తెలిపారు. అమరులైన వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని దేశంలో గాని, రాష్ట్రంలో గాని, జిల్లాలో గాని శాంతి భద్రతలను పరిపాలనను సజావుగా కొనసాగించేందుకు సిబ్బంది తమ విధులు  నిర్వహిస్తున్నారని అన్నారు.


వివిధ శాఖల్లో సిబ్బంది ఉద యం నుంచి సాయంత్రం వరకే విధులు నిర్వహిస్తారని పోలీసుశాఖలో  మాత్రం 24 గంటలు విధులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పోలీసు సిబ్బందికి ఎలా ంటి పండుగలు, సెలవులు ఉండవని ఇంత గొప్పగా విధులు నిర్వహించే పోలీసు  సిబ్బంది ఎంతో గొప్పవారని అమ రులైన పోలీసు సిబ్బందికి పేరు పేరునా నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు సంబంధించిన సమస్యలను తొందరలోనే పరిష్కరిస్తామని అన్నా రు. ఈ సంవత్సరంలో దేశం మొత్తంలో 264 మంది ప్రాణాలు కోల్పోయారని మన తెలంగాణ రాష్ట్రం పరిఽధిలోని నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్‌లలో 1987 సంవత్సరం నుంచి నేటి వరకు 19 మంది పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయారన్నారు. అమరులైన వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతీ ఒక్కరం విధులు గౌరవప్రదంగా నిర్వహించాలన్నారు. అనంతరం నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్తికేయ మాట్లాడుతూ పోలీసులు విధి నిర్వహణలో ముందుంటారని 1989 అక్టోబరు 21న విధి నిర్వహణలో ఉన్న 10 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌లు లడక్‌లోని ఆక్సాయ్‌చిన్‌ వద్ద చైనా ఎదురుదాడిలో ఆసువులు బాయడంతో అప్పటి నుంచి ప్రతీ సంవత్సరం పోలీస్‌ సంస్మరణ దినం జరుపుకోవడం జరుగుతుందని అన్నారు.


విధి నిర్వహణలో అమరులైన వారి త్యాగాలను గుర్తుంచుకోవడం, విధి నిర్వహణలో వారి ప్రాణాలు ఇవ్వడం జరిగిందని, వారి త్యాగాలను వృథా చేయకుండా, వారి ఆశయసాధన కోసం పాటుపడాలని అన్నారు. అమరులైన పోలీసు కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉండి అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అమరులైన పోలీసు త్యాగాలు  మరువలేనివని కొనియాడారు. దేశంలో అసాంఘిక శక్తుల ద్వారా అసువులు బాసిన అమరవీరులు ఈ సంవత్సర కాలంలో 264 మంది ప్రాణాలు కోల్పోయారని అందులో డి.ఐ.జి. ఒకరు, అడిషనల్‌  ఎస్పీ ఒకరు, డీఎస్పీలు ఇద్దరు, సీఐలు ఒక రు, ఎస్‌ఐలు 13 మంది, ఏ.ఎస్‌.ఐలు 35 మంది, హెడ్‌కానిస్టేబుళ్లు 65 మంది, కానిస్టేబుళ్లు 141, హోంగార్డులు ముగ్గురు అమరులయ్యారని  అన్నారు. అనంతరం ఏడాది కాలంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 264 మంది సిబ్బందికి పేరుపేరునా నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు.


పోలీసు అమరవీరుల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు.  అమరవీరుల కుటుంబాలకు కలెక్టర్‌ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎస్పీ శ్వేత, అద నపు డీసీపీ(అడ్మిన్‌) ఉషా విశ్వనాథ్‌, ఏఆర్‌. డీఎస్పీ ఎన్‌.భాస్కర్‌, నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ ట్రాఫిక్‌ ఏసీపీలు, డీఎస్పీలు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, అమరవీరుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-22T06:45:58+05:30 IST