చంద్రబాబుకు ఘన స్వాగతం

ABN , First Publish Date - 2021-11-26T05:27:02+05:30 IST

శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. నెల్లూరు వరద బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబు రేణిగుంట నుంచి రోడ్డుమార్గంలో వెళ్లారు.

చంద్రబాబుకు ఘన స్వాగతం
ప్రజలకు అభివాదం చేస్తున్న చంద్రబాబు

శ్రీకాళహస్తి, నవంబరు 25: శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. నెల్లూరు వరద బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబు రేణిగుంట నుంచి రోడ్డుమార్గంలో వెళ్లారు. అధినేతకు స్వాగతం పలికేందుకు ఏపీసీడ్స్‌ కూడలి వద్దకు టీడీపీ నాయకులు,  కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి బొజ్జల సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. ముందుగా చంద్రబాబును శ్రీకాళహస్తీశ్వరాలయ దుశ్శాలువాతో సత్కరించి స్వామి అమ్మవార్ల కలంకారీ చిత్రం,తీర్థప్రసాదాలను అందజేశారు.రాష్ట్ర కార్యదర్శి చలపతినాయుడు, నాయకులు విజయకుమార్‌, కంఠా రమేష్‌, చక్రాల ఉష, ప్రకా్‌షనాయుడు, ప్రసాద్‌నాయుడు, రెడ్డివారి గురవారెడ్డి, కామే్‌షయాదవ్‌, గాలి మురళీనాయుడు  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-26T05:27:02+05:30 IST