చంద్రబాబుకు ఘన స్వాగతం

ABN , First Publish Date - 2022-05-19T06:00:53+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో భాగంగా బుధవారం కర్నూలుకు చేరుకున్నారు.

చంద్రబాబుకు ఘన స్వాగతం
చాగలమర్రిలో బుధవారం అర్ధరాత్రి చంద్రబాబు రాక కోసం ఎదురుచూస్తున్న శ్రేణులు

  1.  చాగలమర్రికి భారీగా తరలి వచ్చిన టీడీపీ శ్రేణులు
  2.   అర్ధరాత్రి వరకు నిరీక్షణ


 కర్నూలు/ చాగలమర్రి, మే 18 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో భాగంగా బుధవారం కర్నూలుకు చేరుకున్నారు. కడప జిల్లా పర్యటన ముగించుకొని అర్ధరాత్రి 12 గంటల తరువాత నంద్యాల జిల్లా చాగలమర్రి వద్ద జిల్లాలో అడుగు పెట్టారు. మాజీ మంత్రి అఖిలప్రియ, బనగానపల్లె, నంద్యాల మాజీ ఎమ్మెల్యేలు బీసీ జనార్దనరెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డి, టీడీపీ సీనియర్‌ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి, టీడీపీ యువ నాయకుడు జగత విఖ్యాత రెడ్డి, భార్గవ్‌, ఆళ్లగడ్డ టీడీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి నంద్యాల మీదుగా కర్నూలు చేరుకున్నారు. అనంతరం స్థానిక మౌర్య ఇన హోటల్‌లో బస చేశారు. గురువారం ఉదయం 10.30 గంటలకు మౌర్యఇన హోటల్‌ నుంచి బయలుదేరి 11 గంటలకు నందికొట్కూరు రోడ్డులోని కమ్మ సంఘం కల్యాణ మండపానికి చేరుకుంటారు. అక్కడ ఉమ్మడి కర్నూలు జిల్లాల్లోని సమన్వయ కమిటీ, నియోజకవర్గ ఇనచార్జిలు, ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. 2024 ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు భోజనం తరువాత కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. 2.45 గంటలకు కర్నూలు నుంచి డోన నియోజకవర్గం ప్యాపిలి మండలం జలదుర్గంలో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమానికి బయలుదేరుతారు. మార్గమధ్యలో 3.15 గంటల సమయంలో పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి వద్ద టీడీపీ కార్యకర్తలతో మాట్లాడుతారు. 4.15-4.30 గంటల సమయంలో జలదుర్గం చేరుకొని అక్కడ ‘బాదుడే బాదుడు’లో పాల్గొంటారు. ఆ కార్యక్రమం అనంతరం అనంతపురం జిల్లా పర్యటనకు బయలుదేరుతారు. చంద్రబాబు పర్యటనను పురస్కరించుకొని కార్యకర్తల సమావేశం కోసం కమ్మ సంఘం కల్యాణ మండపం ప్రాంగణంలో భారీగా ఏర్పాట్లు చేశారు. జలదుర్గంలో డోన టీడీపీ ఇనచార్జి ఽధర్మావరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. 







Updated Date - 2022-05-19T06:00:53+05:30 IST