నారా లోకేష్‌కు ఘన స్వాగతం

ABN , First Publish Date - 2021-06-19T05:50:22+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ గడివేముల మండలం పెసర వాయి గ్రామంలో హత్యకు గురైన టీడీపీ నాయకుల కుటుంబాలను పరామర్శించేందుకు రోడ్డు మార్గాన వెళ్తుండగా.. నన్నూరు గ్రామ సమీపాన గల టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

నారా లోకేష్‌కు ఘన స్వాగతం
నారా లోకేష్‌ను గజమాలతో సన్మానిస్తున్న టీడీపీ నాయకులు

ఓర్వకల్లు, జూన్‌ 18: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ గడివేముల మండలం పెసర వాయి గ్రామంలో హత్యకు గురైన టీడీపీ నాయకుల కుటుంబాలను పరామర్శించేందుకు రోడ్డు మార్గాన వెళ్తుండగా.. నన్నూరు గ్రామ సమీపాన గల టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యేలు కోట్ల సుజాతమ్మ, భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌ రెడ్డి, కర్నూలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నంద్యాల పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి, పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత, మాజీ జడ్పీ చైర్మన్‌ రాజశేఖర్‌, నాయకులు పెరుగు పురుషోత్తం రెడ్డి, మోహన్‌ రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, గోవింద రెడ్డి పుష్పగుచ్చాలు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పెసరవాయి గ్రామంలో జరిగిన జంట హత్యలపై ఆయన నాయకులతో అడిగి తెలుసుకున్నారు. అదే విదంగా రోడ్డు మార్గాన వెళ్తున్న నారా లోకేష్‌కు హుశేనాపురం బస్టాండు వద్ద మాజీ జడ్పీ చైర్మన్‌ రాజశేఖర్‌, మైనార్టీ నాయకులు మహబూబ్‌ బాషా భారీ గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుధాకర్‌, రామగోవిందు, నారాయణ, కార్యకర్తలు నాయకులు  భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పెసరవాయి గ్రామంలో అంత్యక్రియల్లో పాల్గొన్న నారా లోకేష్‌, మధ్యాహ్నం 2 గంటల సమయంలో కర్నూలు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కర్నూలు ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాదుకు ప్రత్యేక విమానంలో బయల్దేరుతున్న నారా లోకేష్‌కు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి, గౌరు చరితారెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్‌ రాజశేఖర్‌, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్‌ రెడ్డి, మండల కన్వీనర్‌ గోవింద రెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి ఘనంగా వీడ్కోలు పలికారు. ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలు  జరగకుండా రూరల్‌ సీఐ శ్రీనాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఓర్వకల్లు ఎస్‌ఐ మల్లికార్జున గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజయుడు, ఖాజామియా,  రమణారెడ్డి, నాగేశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-06-19T05:50:22+05:30 IST