స్వామి వారల సేవను ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తున్న దృశ్యం
ముగిసిన శ్రీ లక్ష్మీ నరసింహ బ్రహ్మోత్సవాలు
ధర్మపురి, మార్చి 26: ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి (ఉగ్ర) వారల ఏకాంతోత్సవం శనివారం రాత్రి అత్యంత వైభ వంగా జరిగింది. ఆలయ వేదపండితులు బొజ్జ రమేష్శర్మ తదితర వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు రాత్రి స్వామి వారలకు ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను సేవలపై ఉంచి ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయించారు. అర్ధరాత్రి ఉత్సవ మూర్తులను వేదిక వద్దకు తీసుకెళ్లి ఏకాంతోత్సవం నిర్వహిం చారు. దీంతో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం బ్రహ్మోత్స వాలు ముగిశాయి. యజ్ఞాచార్యులు కందాలై పురుషోత్తమా చార్య నేతృత్వంలో ఆలయ ఉపప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీని వాసాచార్యులు, ముఖ్య అర్చకులు నంబి నరసింహమూర్తి, శ్రీనివాసాచారి, అర్ధరాత్రి వరకు కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు దర్శనం చేసుకుని ఉత్సవాన్ని తిలకించారు. అంతకు ముందు హైదరాబాద్కు చెందిన కోక విజయలక్ష్మి బృందం ఆధ్వర్యంలో కళాకారులు, చిన్నారులచే నిర్వహించిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు పలువురు భక్తులను ఆకట్టుకున్నాయి. అర్ధరాత్రి వరకు భక్తులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో ఈవో సంకటాల శ్రీనివాస్, మున్సిపల్ వైస్చైర్మ న్, ఆలయ రినోవేషన్ కమిటీ సభ్యులు ఇందారపు రామయ్య, సభ్యులు, ఆలయ సూపరింటెండెంట్ కిరణ్కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సంగనభట్ల దినేష్, పట్టణ వర్తక సంఘం అధ్యక్షులు అక్కెనపెల్లి రాజేం దర్ పాల్గొన్నారు.