మలబద్దకంతో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి!

ABN , First Publish Date - 2022-06-02T22:43:29+05:30 IST

నాకు అరవై ఏళ్ళు. మలబద్దకంతో బాధపడుతున్నాను. ఆహారం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా?

మలబద్దకంతో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి!

ఆంధ్రజ్యోతి(01-06-2022)

ప్రశ్న: నాకు అరవై ఏళ్ళు. మలబద్దకంతో బాధపడుతున్నాను. ఆహారం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా?


- వెంకటేశ్వర్లు, సికింద్రాబాద్‌


డాక్టర్ సమాధానం: పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడంతో మలబద్దకం సమస్యను కొంతవరకు అధిగమించవచ్చు. ఈ పీచుపదార్థాలు కేవలం పచ్చి కూరల నుంచి మాత్రమేకాక అనేక రకాల పప్పులలో, ముడి ధాన్యాల్లో కూడా ఉంటాయి. తెల్ల బియ్యం కంటే కూడా బ్రౌన్‌ రైస్‌ లేదా ఎర్ర బియ్యంలో పీచు పదార్థం ఎక్కువ. ఆహారంలో బియ్యానికి బదులుగా చిరు ధాన్యాలైన రాగులు, కొర్రలు, సజ్జలు, జొన్నలు మొదలైన వాటిని తీసుకుంటే కూడా ఉపయోగం ఉంటుంది. అలాగే, రకరకాల పళ్లలో కూడా పీచు పదార్థం ఉంటుంది. ముఖ్యంగా జామ, దానిమ్మ, బత్తాయి, కమలా మొదలైనవి రోజూ తీసుకుంటే ఉపయోగం ఉంటుంది. అరటిపండు మలబద్దకం నివారించడానికి ఉపయోగపడుతుంది. వీటితో పాటు రోజూ రెండు అంజీర్‌ పండ్లు (ఎండు అంజీర్‌) తీసుకుంటే ఉపయోగం ఉంటుంది. కనీసం మూడు నుండి నాలుగు లీటర్ల నీరు తీసుకోవాలి. పై జాగ్రత్తలన్నింటితో పాటు ఉదయం పూట కొంచెం వేడి చేసిన నీరు తీసుకుంటే మలబద్ధకం సమస్య పరిష్కారం అవుతుంది. వ్యాయామం చేయడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. వీటన్నింటితో పాటు, వైద్యుల సలహా తీసుకొని ఏదైనా ఫైబర్‌ సప్లిమెంట్‌ తీసుకుంటే కూడా మంచిదే. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2022-06-02T22:43:29+05:30 IST