రేషన్‌ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-07-02T06:29:21+05:30 IST

రేషన్‌ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి

రేషన్‌ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి
మాట్లాడుతున్న సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు

సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు
ఏలూరు కార్పొరేషన్‌, జూలై 1: రేషన్‌ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని ప్రభు త్వాన్ని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మండాది వెంకట్రావు డిమాండ్‌ చేశారు. ఏలూ రులో శుక్రవారం జిల్లాలోని రేషన్‌ డీలర్లతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. డీలర్లకు సరుకు ఉచిత దిగుమతి చేయాలని, కానీ హమాలీ చార్జీలు తామే భరిస్తున్నామని ఆయన అన్నారు. ఎండీయూ ఆపరేటర్ల చేతిలో రేషన్‌ పంపిణీని పెట్టడం జాతీయ ఆహార భద్రతా చట్టానికి విరుద్ధమన్నారు. ప్రజా పంపిణీలో రాష్ట్రానికో రకంగా కమీషన్‌ ఉండటం సరికాదన్నారు. కేంద్రం వన్‌ కమీషన్‌ విధానం తీసుకురావాలని, క్వింటాల్‌కు రూ.440 కమీషన్‌ ఇవ్వాలని ఆహార భద్రత చట్టం రాష్ట్రంలో సక్రమంగా అమలు అయ్యేలా చూడాలని కోరారు. సమస్యల సాధనకు ఈనెల 4న మండల కార్యాలయాల వద్ద, 11న డివిజన్‌ స్థాయు నిరసనలు, 18న చలో అమరావతి, ఆగస్టు 2న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యూనియన్‌ రాష్ట్ర అదనపు కార్యదర్శి పసుపులేటి శివప్రసాద్‌ పిలుపునిచ్చారు.  నూ తనంగా ఏర్పడిన ఏలూరు జిల్లాకు పరిశీకుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముత్యాల శేష గిరిరావు ఆధ్వర్యంలో కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షుడిగా తలారి రామ కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా అత్తులూరి ఉదయేశ్వరరావు, కోశాధికారిగా కాగిత నాగ రాజు, గౌరవాధ్యక్షుడిగా టీఏవీవీఎల్‌ నరససింహమూర్లిని ఎంపిక చేశారు. అనంత రం ప్రమాణం చేశారు.

Updated Date - 2022-07-02T06:29:21+05:30 IST