24 గంటల్లో తాగునీటి సమస్య పరిష్కారం

ABN , First Publish Date - 2021-04-13T04:48:45+05:30 IST

తాగునీటి సమస్యపై ఫిర్యాదులు వస్తే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ పప్పు రవి ఆదేశించారు. సోమవారం కలె

24 గంటల్లో తాగునీటి సమస్య పరిష్కారం
మాట్లాడుతున్న ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ రవి





ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ రవి

కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 12: తాగునీటి సమస్యపై ఫిర్యాదులు వస్తే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ పప్పు రవి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. మరమ్మతులకు గురైన బోర్లను వెంటనే బాగుచేయాలని ఆదేశించారు. సబ్‌ డివిజన్‌ స్థాయిలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటుచేసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని చెప్పారు. జగనన్న కాలనీల్లో 196 బోర్లు తవ్వించామని..మిగిలిన వాటిలో కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. జలజీవన్‌ మిషన్‌ కింద 1242 పనులకు రూ.272 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిపారు. జిల్లాలో మొత్తం 18,257 చేతిపంపులు ఉన్నాయని తెలిపారు. ఇందులో 148 మరమ్మతులకు గురయ్యాయన్నారు. క్రాష్‌ ప్రొగ్రాం ద్వారా వాటిని బాగుచేయాలని ఆయన సూచించారు. సమావేశంలో అధికారులు, సిబ్బంది   పాల్గొన్నారు.


Updated Date - 2021-04-13T04:48:45+05:30 IST