జీఎం నారాయణకు వినతి పత్రం అందజేస్తున్న అధికారుల సంఘం నాయకులు
- జీఎంకు విన్నవించిన అధికారుల సంఘం
గోదావరిఖని, మే 13: గోదావరిఖని దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నఅధికారుల సమస్యలను పరిష్కరించాలంటూ శుక్రవారం సీఎంఓఏఐ అధికారుల సంఘం నాయకులు ఆర్జీ-1 జీఎం కల్వల నారాయణకు వినతి పత్రం అందించారు. 2019-20 సంవత్సరానికి సంబంధించిన పీఆర్ఫీ కోల్ ఇండియాలో ఇచ్చిన మాదిరిగానే సింగరేణిలో ఇవ్వాలని, ఉచిత విద్యుత్, వసతులను అధికారులకు కూడా వర్తింప చేయాలని, గతంలో యాజమాన్యం ఇచ్చిన హామీ ప్రకారం ల్యాబ్టాబ్లను మంజూరు చేయాలని, న్యాయబద్దమైన ప్రమోషన్ పాలసీని రూపొందించి అన్నీ గ్రేడ్ల వారికి పదోన్నతి ఇవ్వాలని, పదోన్నతుల సమస్యలు పరిష్కరించాలని, అధికారుల్లో ఉన్న అసంతృప్తులను పోగొట్టాలని, అధికారులు ఉత్సాహంతో పని చేసి రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి ప్రోత్సహించాలని, 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణి సంస్థ రికార్డు స్థాయిలో 650లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించడం సింగరేణి సంస్థకు గర్వకారణమని, అధికారుల కు ఐఐఎం, ఐఐటీ ఫీజు రియాంబర్స్మెంట్ కల్పించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జీఎం అధికారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామి ఇచ్చారు. సీఎంఓఏఐ అధ్యక్షుడు పొనగోటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి డేవిడ్, కోశాధికారి హరి ప్రసాద్, జాయింట్ సెక్రటరీ మహ్మద్ అలీ, జీఎంలు త్యాగరరాజు, కేవీ రావు, లక్ష్మీనారాయణ, మదన్మోహన్, ఆంజనేయప్రసాద్, బాలసుబ్రహ్మణ్యంం, సాంబశివరావు, ఖలీల్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.