రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2021-07-26T06:45:48+05:30 IST

జిల్లాలో రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయడంతో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జేసీ(రెవెన్యూ) స్వప్నిల్‌ దినకర్‌ అన్నారు.

రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి
జేసీ(రెవెన్యూ) స్వప్నిల్‌ దినకర్‌

చిత్తూరు, జూలై 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయడంతో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జేసీ(రెవెన్యూ) స్వప్నిల్‌ దినకర్‌ అన్నారు. కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆయన్ను ప్రభుత్వం ఇటీవల చిత్తూరు జిల్లా రెవెన్యూ జాయింట్‌ కలెక్టర్‌గా బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. బుధవారం లేదా ఆ తర్వాత మంచి రోజు చూసుకుని బాధ్యతలు తీసుకుంటానని చెప్పారు. కలెక్టర్‌ హరినారాయణన్‌ సహకారంతో అధికారులను సమన్వయం చేసుకుని జిల్లా అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తానన్నారు. జిల్లాలో కీలకమైన రెవెన్యూ జేసీ పోస్టును తనుకు కేటాయించి పెద్ద బాధ్యత అప్పగించిన ప్రభుత్వ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. మహారాష్ట్రలోని బుల్ధన జిల్లాకు చెందిన స్వప్నిల్‌ దినకర్‌ 2016లో ఐఏఎ్‌సకు ఎంపికయ్యారు. నూజివీడు సబ్‌కలెక్టర్‌గా, కాకినాడ మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేసి చిత్తూరు రెవెన్యూ జేసీగా వస్తున్నారు.

Updated Date - 2021-07-26T06:45:48+05:30 IST