తెలుగుగంగ వరద, ఉత్తర కాలువలపై సర్వే

ABN , First Publish Date - 2021-05-11T04:10:40+05:30 IST

సోమశిల జలాశయం పరిధిలోని ఉత్తర, తెలుగుగంగ వరద కాలువల అభివృద్ధికి మోక్షం కలిగింది. డబ్లింగ్‌ పనుల్లో భాగంగా రెండు కాలువలకు

తెలుగుగంగ వరద, ఉత్తర కాలువలపై సర్వే
సోమశిల ఉత్తర కాలువ

సామర్థ్యం పెంపు పనులకు మోక్షం

 పూర్తయితే తొలగనున్న నీటి ఇక్కట్లు

అనంతసాగరం, మే 10: సోమశిల జలాశయం పరిధిలోని ఉత్తర, తెలుగుగంగ వరద కాలువల అభివృద్ధికి మోక్షం కలిగింది. డబ్లింగ్‌ పనుల్లో భాగంగా రెండు కాలువలకు సామర్థ్యం పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుల్లో భాగంగా కాలువ అభివృద్ధి ప్రణాళిక ప్రకారం సర్వే పనలు చురుగ్గా జరుగుతున్నాయి. సోమశిల ఉత్తరకాలువ 106 కి.మీ విస్తరించి ఉండగా ప్రస్తుతం కాలువ సామర్థ్యం 750 క్యూసెక్కులు. దానిని 1,400 క్యూసెక్కులకు పెంచేలా చర్యలు చేపట్టారు. ఇక తెలుగుగంగ వరద కాలువ సోమశిల నుంచి కండలేరు జలాశయం వరకు 46 కి.మీ విస్తరించి ఉండగా సోమశి లకు వచ్చే వరద నీరు కండలేరుకు తరలించి అక్కడ నుంచి చిత్తూరు, చెన్నై నగరాలకు అందిస్తారు. ప్రస్తుతం ఈ కాలువ సామర్థ్యం 11,500 క్యూసెక్కులు కాగా 24,000 క్యూసెక్కులకు పెంచనున్నారు.  రెండు కాలువల పరిధిలో ఎక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలి, నిర్మాణ పనులకు అనుకూ ల పరిస్థితుల అన్వేషణలో యంత్రాంగం నిమగ్నమైనట్లు తెలుస్తుంది. 

Updated Date - 2021-05-11T04:10:40+05:30 IST