bank vacancies: బ్యాంక్ ఉద్యోగం చేయాలనుకుంటున్నారా?.. సువర్ణావకాశం.. ఎస్‌బీఐ, నాబార్డ్‌తోపాటు..

ABN , First Publish Date - 2022-10-04T03:39:15+05:30 IST

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా?.. ఇప్పటికే ప్రిపేరవుతూ దరఖాస్తుకు సిద్ధంగా ఉన్నారా? అయితే పలు బ్యాంకులు చక్కటి ఉద్యోగ అవకాశాలతో సిద్ధంగా ఉన్నాయి.

bank vacancies: బ్యాంక్ ఉద్యోగం చేయాలనుకుంటున్నారా?.. సువర్ణావకాశం.. ఎస్‌బీఐ, నాబార్డ్‌తోపాటు..

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా?.. ఇప్పటికే ప్రిపేరవుతూ దరఖాస్తుకు సిద్ధంగా ఉన్నారా? అయితే పలు బ్యాంకులు చక్కటి ఉద్యోగ అవకాశాలతో సిద్ధంగా ఉన్నాయి. ఎస్‌బీఐ, యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రధాన ప్రభుత్వరంగ బ్యాంకులు వేర్వేరు పోస్టులకు దరఖాస్తులను కోరుతున్నాయి. కాబట్టి ఇప్పటికే బ్యాంకు ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూసేవారికి ఇది సువర్ణావకాశం. ప్రస్తుతం జాబ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతున్న ప్రభుత్వరంగ బ్యాంకులు ఉన్నాయి. ఆ జాబితా మీరూ చూసేయండి.


ఎస్‌బీఐ ప్రొబెషనరీ ఆఫీసర్ ఎగ్జామ్ 2022..

దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ (SBI) ప్రొబెషనరీ ఆఫీసర్ (PO) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎస్‌బీఐ కెరీర్ పోస్టల్స్ sbi.co.in/careers మరియు sbi.co.in. పై ఉద్యోగార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 1673 ఖాళ్లీల కోసం జరుగుతున్న ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి అక్టోబర్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


యుకో బ్యాంక్

యుకో బ్యాంక్ (UCO bank) 10 సెక్యూరిటీ ఆఫీసర్స్ కోసం అప్లికేషన్లు ఆహ్వానిస్తోంది. బ్యాంకు అఫీషియల్ వెబ్‌సైట్ ucobank.com పై దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 19గా ఉంది.


సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ 2022..

110 మంది ఆఫీసర్ల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్లికేషన్లు ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు బ్యాంక్ వెబ్‌సైట్ centralbankofindia.co.in. పై దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ అఫీషియల్ వెబ్‌సైట్ centralbankofindia.co.in. పై అప్లై చేసుకోవచ్చు. కాగా దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 17గా ఉంది.


నాబార్డ్‌లో ఖాళ్లీలు..

నాబార్డ్ (National Bank For Agriculture and Rural Development) 177 మంది డెవలప్‌మెంట్ అసిస్టెంట్ ఆఫీసర్స్‌ను భర్తీ చేసుకుంటోంది. నాబార్డ్ అఫీషియల్ వెబ్‌సైట్ nabard.org. పై ఔత్సాహిక అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు అక్టోబర్ 10 చివరి తేదీగా ఉంది. 


కాగా జాబ్, అర్హతలు, ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తివివరాలను అభ్యర్థులు ఆయా బ్యాంకుల అఫీషియల్ వెబ్‌సైట్లలో తెలుసుకోవాలని సూచన. కాగా కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు కూడా మెరుగవ్వడంతో  ఉద్యోగావకాశాలు కూడా పెరిగాయి. ఈ కారణంగానే బ్యాంకులు కూడా దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలను మరింత విస్తరించుకుంటున్నాయి. మంచి జీతంతోపాటు సమాజంలో గుర్తింపు ఉండడంతో బ్యాంకు ఉద్యోగాలపై యువత మక్కువ చూపుతున్నారు.

Updated Date - 2022-10-04T03:39:15+05:30 IST