కొత్త హంగులు

ABN , First Publish Date - 2021-06-19T05:30:00+05:30 IST

వాట్సాప్‌ కొన్ని కొత్త ఫీచర్లను తీసుకువస్తోంది. ‘మల్టీ డివైజ్‌ సపోర్ట్‌’, ‘వాయిస్‌ రివ్యూ’, ‘వ్యూ వన్స్‌’, మరింత మెరుగ్గా ‘డిసప్పియరింగ్‌ మోడ్‌’, ‘ఆర్కైవ్‌ టు సపోర్ట్‌’ వంటివి ఇందులో ఉన్నాయి.

కొత్త హంగులు

వాట్సాప్‌ కొన్ని కొత్త ఫీచర్లను తీసుకువస్తోంది. ‘మల్టీ డివైజ్‌ సపోర్ట్‌’, ‘వాయిస్‌ రివ్యూ’, ‘వ్యూ వన్స్‌’, మరింత మెరుగ్గా ‘డిసప్పియరింగ్‌ మోడ్‌’, ‘ఆర్కైవ్‌ టు సపోర్ట్‌’ వంటివి ఇందులో ఉన్నాయి. అలాగే కొన్ని ఫీచర్లను మరింత మెరుగ్గా ఎప్పటికప్పుడూ మలుస్తూ ఉంటుంది. వివరాల్లోకి వెళితే...


ఆండ్రాయిడ్‌, ఐఔస్‌ కోసం కొత్త ఫీచర్లు అందించేందుకు ‘వాట్సాప్‌’ నిరంతరాయంగా ట్రయల్స్‌ నిర్వహిస్తూనే ఉంది. యూజర్‌ ఫ్రెండ్లీగా ఉండే వాటిని డెలివరీ చేస్తూ ఉంటుంది. కొన్ని త్వరలో రానుండగా, ఇప్పటికే ఉన్న వాటిని మరింత మెరుగు పరుస్తోంది. ఇలాంటి వాటిలో ‘వ్యూ వన్స్‌’, ‘డిసప్పియరింగ్‌ మోడ్‌’ కొన్ని. అయితే వీటిని ఎప్పుడు రిలీజ్‌ చేస్తుందన్న విషయం తేటతెల్లం కాలేదు.  


అధికారికంగా విడుదల కానప్పటికీ, వీటిలో కొన్నింటిని వేరే మార్గాల్లో ఉపయోగించి చూడవచ్చు. ఇందుకు వాట్సాప్‌ బేటా ప్రోగ్రామ్‌ ఉపయోగపడుతుంది. అందులో స్లాట్‌ను చిక్కించుకోగలిగితే విడుదల కాబోయే వాటిని ముందే ఆస్వాదించి తెలుసుకోవచ్చు. 


‘డిసప్పియరింగ్‌ మోడ్‌’ గత ఏడాదే ఆరంభమైంది. ఈ ఫీచర్‌తో  మెసేజ్‌లను పంపిన వారం రోజుల తదుపరి  ఆటోమేటిక్‌గా అవి అదృశ్యమవుతాయి. వ్యక్తిగత, గ్రూప్‌ చాట్ల వరకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. అదే ఈ మోడ్‌ను టర్న్‌ ఆన్‌ చేస్తే చాలు వాట్సాప్‌ చాట్‌లపై ఇది పనిచేస్తుంది. ప్రస్తుతం దీనిని మరింత మెరుగుపరిచే పనిలో ‘వాట్సప్‌’ ఉంది. 


‘వ్యూ వన్స్‌’ అనేది పేరుకు తగ్గట్టు ఒక్కసారి మాత్రమే చూసే వీలు కల్పిస్తుంది. వాట్సాప్‌లోని ఫొటోలు, వీడియోలకు ఇది వర్తిస్తుంది. అదృశ్యమయ్యేలోపు వాటి స్ర్కీన్‌షాట్‌ తీసుకునే వెసులుబాటు మాత్రం ఉంటుంది. 


‘వాయిస్‌ రివ్యూ’ మెసేజ్‌ మరొక ఫీచర్‌. ప్రస్తుతం దీనిపై వాట్సాప్‌ వర్క్‌ చేస్తోంది. ఇది వస్తే, ఒక మెసేజ్‌ను రికార్డు చేయాలా, మధ్యలో ఆపేయాలా అన్న వెసులుబాటు లభిస్తుంది.  కావాలనుకుంటే డిలీట్‌ కూడా చేసేయవచ్చు. రికార్డు చేయకుండా సెండ్‌ కూడా చేయవచ్చు. 


‘మల్టీ డివైజ్‌ సపోర్ట్‌’ మరొకటి. చాలా పెద్ద అప్‌డేట్‌గా దీన్ని చెప్పవచ్చు. దీంతో నాలుగు డివైజెస్‌లకు ఒకేసారి కనెక్ట్‌ కావచ్చు. మెయిన్‌ డివైస్‌కు యాక్టివ్‌ ఇంటర్నెట్‌ లేకుండా కూడా వీటిపై పనిచేసుకోవచ్చు. పబ్లిక్‌ బేటా యూజర్లకు మరో రెండు నెలల్లోనే ఇది అందుబాటులోకి వస్తుంది. ఐపాడ్‌పై ఇది వాట్సాప్‌ను సపోర్ట్‌ చేస్తుంది. 


వాయిస్‌ మెసేజ్‌లకు నేపథ్య సంగీతాన్ని ఇటీవల విడుదల చేసింది. నార్మల్‌ కంటే స్పీడ్‌ ఇప్పుడు వాయిస్‌ మెసేజ్‌లను వినవచ్చు. పంపడానికి ముందే రివ్యూ చేసే సదుపాయాన్ని కల్పించే పనిలో ‘వాట్సాప్‌’ ఉంది.  ఇప్పటికి మాత్రం ఒకసారి రికార్డ్‌ చేస్తే వెంటనే పంపేయడమే తప్ప, వినే సౌలభ్యం లేదు. 


‘ఆర్కైవ్‌’పై వాట్సాప్‌ చాలాకాలంగా పనిచేస్తోంది. ఇది ‘వాట్సాప్‌’లో ప్రత్యేక విభాగంగా ఏర్పడుతుంది. ఆర్కైవ్డ్‌ చాట్స్‌ విభాగంపై దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో  కొత్త మెసేజ్‌ వచ్చినప్పుడూ చూపిస్తుంది. అయితే  ఈ ఫీచర్‌తో కొత్తగా మెసేజ్‌లు అందుతున్నప్పటికీ అర్కైవ్‌ మ్యూట్‌లో ఉంటుంది. ‘ఆర్కైవ్డ్‌ చాట్‌’ సెక్షన్‌లోనే పాత మెసేజ్‌లన్నీ కనిపిస్తాయి. 

Updated Date - 2021-06-19T05:30:00+05:30 IST